వెంకీ తో జాతిరత్నం

Sat 19th Mar 2022 03:30 PM
venkatesh,jathi ratnalu,director anudeep,rana,drushyam,narappa,f3 movie  వెంకీ తో జాతిరత్నం
Venkatesh teaming with Anudeep of Jathi Ratnalu fame? వెంకీ తో జాతిరత్నం

వెంకటేష్ నారప్ప, దృశ్యం మూవీస్ ని ఓటిటిలో రిలీజ్ చేసి హిట్స్ అందుకున్నారు. తర్వాత వెంకీ నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 3 కూడా మే 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అయితే వెంకీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి జంప్ చేసారు. తన అన్న కొడుకు, హీరో రానా తో కలిస్ నెట్ ఫ్లిక్స్ కోసం రానా - నాయుడు వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. అయితే వెంకీ ఎఫ్ 3 తర్వాత చెయ్యబోయే దర్శకుడిపై అందరిలో క్యూరియాసిటీ ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం వెంకీ తన తదుపరి మూవీ ని జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

గత ఏడాది నవీన్ పోలిశెట్టి కలిసి అనుదీప్ జాతి రత్నాలు అనే హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ తో అదిరిపోయే హిట్ అందుకున్నారు. తన తదుపరి సినిమాని తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో తెలుగు, తమిళ్ లో బై లింగువల్ మూవీ చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది. అయితే ఇప్పుడు అనుదీప్ తో వెంకీ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, వెంకీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే అనుదీప్ క‌థ‌ను సిద్ధం చేశార‌ట‌. అనుదీప్ చెప్పిన క‌థ వెంకీ కి న‌చ్చేసిందని.. త్వ‌ర‌లోనే వెంక‌టేష్ త‌దుప‌రి సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని స‌మాచారం.

Venkatesh teaming with Anudeep of Jathi Ratnalu fame?:

Venkatesh lining up a comedy crapper?