బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం నామినేషన్స్

బిగ్ బాస్ ఓటిటి మొదలై 14 రోజులు పూర్తవగా.. 15 వ రోజు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. గత రెండు వారాల్లో మొదటి వారం వారియర్స్ టీమ్ నుండి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారం అనూహ్యంగా చాలెంజర్స్ టీం నుండి శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యింది. ఈ అదివారం నాగార్జున హౌస్ మేట్స్ లో తప్పు చేసిన యాంకర్ శివ, బిందు మాధవిలని మందలించారు. యాంకర్ శివ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సరయుని ఇబ్బంది పెట్టాడని, బిందు మాధవి ఫుడ్ విసిరెయ్యడంతో నాగ్ వాళ్లపై ఫైర్ అయ్యారు. 

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లు గెలిచి, తేజస్వి సంచాలక్ డెసిషన్ లో అనిల్ రాథోడ్ కెప్టెన్ అయ్యాడు. ఇక మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా వాడి వేడిగా కాదు.. మాటల యుద్ధంతోనే ముగిసింది. ఈ వారం 12 మంది నామినేషన్స్ కి వెళ్లారు. అందులో మిత్ర శర్మ, యాంకర్ శివ, చైతూ, తేజస్వి, అజయ్, శ్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియనా, బిందు మాధవి ఉన్నారు. హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది యాంకర్ శివ బిహేవియర్ బాలేదు అంటూ అతన్ని నామినేట్ చేసారు. యాంకర్ శివ కి నటరాజ్ మాస్టర్ కి నామినేషన్స్ విషయంలో గట్టిగానే ఆర్గ్యూ జరిగింది. అందులో అఖిల్ , నటరాజ్ మాస్టర్ లు ముందు రెండు వారాల నుండి నామినేషన్స్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇక నామినేషన్స్ ముగియడంతో అందరూ ఈ నామినేషన్స్ ప్రక్రియ గురించిన టాపిక్ తో బిజీ అయ్యారు.  

Bigg Boss OTT Telugu today highlights

Bigg Boss OTT: 3rd Week Nominations
bigg boss
bigg boss ott telugu
nagarjuna
bigg boss nominations