Loading...

అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్

Akhil Agent Release on

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో రొమాంటిక్ హిట్ కొట్టిన అక్కినేని యంగ్ హీరో అఖిల్.. ఇప్పుడు మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. రా ఏజెంట్ గా అఖిల్ అక్కినేని మేకోవర్ సూపర్బ్ అనేలా ఏజెంట్ ఫస్ట్ లుక్ లో చూపించారు. సిక్స్ ప్యాక్ బాడీ తో అఖిల్ ఈ సినిమా కోసం స్పెషల్ గా మేకోవర్ అయ్యాడు. సురేందర్ రెడ్డి హీరోలని మాస్ గా ప్రెజెంట్ చేస్తూ స్టైలిష్ గా చూపిస్తారు. ఇంకా ఈ సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి డెవిల్ గా నటించడం. ఈ మధ్యనే మమ్ముట్టి లుక్ రిలీజ్ చెయ్యగా దానికి విశేష స్పందన వచ్చింది.

భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ నుండి రిలీజ్ డేట్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది ఆగష్టు 12 న ఏజెంట్ మూవీ విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. ఆగష్టు 11 నుండి ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం ఆదిపురుష్ తప్పుకోవడంతో.. అ డేట్ కి ఒకరోజు తర్వాత అఖిల్ ఏజెంట్ తో ఫిల్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో అదే ఆగష్టు 11 డేట్ కి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ అవుతుంటే.. తెలుగులో ఆగష్టు 12 న అఖిల్ ఏజెంట్ తో వస్తున్నాడు. ఇక ఏజెంట్ సినిమాలో అఖిల్ తో ముంబై మోడల్ సాక్షి వైదే తో రొమాన్స్ చేస్తుంది. 

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara Agent Releasing Worldwide Grandly In Theatres On August 12th

akhil akkineni
surender reddy
anil sunkara
agent movie
agent releasing worldwide on august 12th
akhil akkineni