Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pic Talk: Samantha Latest hot Photoshoot

పిక్ టాక్: ఎందుకీ తాపత్రయం

Pic Talk: Samantha Latest hot Photoshoot

అక్కినేని టాగ్ వదిలేసాక.. సమంత సోలోగానే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ తో వెకేషన్స్, తీర్థ యాత్రలు అంటూ విడాకుల బాధని మర్చిపోవడానికి ట్రై చేసింది. ఆ తర్వాత అటు సినిమాలు, ఇటు గ్లామర్ షూట్స్ అంటూ హడావిడి మొదలు పెట్టింది. చైతు తో విడిపోయాక కెరీర్ ఏమైపోతుందో అనే అలోచనతో సమంత రాంగ్ స్టెప్స్ వేస్తుందా అనేంతగా మారిపోయింది. ఆమె తీసుకున్న ఆ స్టెప్ ఆమెకి సక్సెస్ ని ఇచ్చినా.. చాలామందికి సమంత చేస్తున్న పని మాత్రం నచ్చడం లేదు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఊ అంటావా.. మావా ఊఉ అంటావా మావా అని.. ఓకె క్రేజ్ ఉంది, అందం ఉంది ఆ సాంగ్ చెయ్యొచ్చు. కానీ లెక్కకి మించిన అందాలు ఆరబోసింది ఆ సాంగ్ లో. ఆ సాంగ్ లో అల్లు అర్జున్ ని చూడలేదు. అందరూ సమంత అందాలనే జుర్రేసారు. ఇంకా ఆల్కహాల్ యాడ్ కోసం సమంత గ్లామర్ షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఇంకా చేతిలో విమెన్ సెంట్రిక్ మూవీస్ ఉన్నాయి. ఎందుకో డివోర్స్ తర్వాత సమంత విపరీతమైన గ్లామర్ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళుతున్నాను.. ఇలానే ఉండాలని సమంత ఫిక్స్ అయ్యిందో.. లేదంటే ఎక్స్ పోజింగ్ తో వేరే లెవల్ చూపించాలి, అప్పుడే స్టార్ హీరోల ఛాన్స్ లు తగులుతాయి అనుకుందో కానీ.. సమంత లేటెస్ట్ గా చేసిన ఓ ఫోటో షూట్ చూస్తే నిజంగా దిమ్మతిరగడం ఖాయం. ఆ రేంజ్ అందాలను ఆ ఫోటో షూట్ లో చూపించేసింది. ఈమె సమంతానే అనేంతగా ఆ హాట్ ఫోటో షూట్ ఉంది. గ్రీన్ కలర్ ఫ్రాక్ లో సమంత చూపించిన క్లివేజ్ అందాలు సోషల్ మీడియానే షేక్ చేసేలా ఉన్నాయి. ఆ ఫోటో షూట్ చూసి కొంతమంది చొంగ కారుస్తుంటే.. మరికొందరు ఎందుకు సమంత నీకు ఈ తాపత్రయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Latest spicy Photoshoot viral

samantha
samantha glamour shoot
samantha hot photo shoot
samantha spicy shoot
samantha new photos