ఉమెన్స్ డే రోజు అనసూయ ట్వీట్ హైలెట్
Anasuya Bharadwaj Tweet as Fools Day on Women's Dayఅనసూయ అంటే అందమే కాదు.. అంతకు మించిన పొగరు, గ్లామర్ కూడా. జబర్దస్త్ స్టేజ్ పైనే కాదు, వెండితెర మీద కూడా పవర్ ఫుల్ రోల్స్ తో అనసూయ బాగా పాపులర్ అవుతుంది. అలాగే తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారి తాట తీసి వదిలిపెడుతుంది. వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ చుక్కలు చూపెడుతుంది. తనపై మహిళలపై కించపరిచే విధంగా ట్రోల్ చేస్తే.. వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
ట్రోలర్స్, మీమ్స్ చేసుకునే వాళ్ళకి సడన్ గా మహిళా దినోత్సవం రోజున మహిళలని గౌరవించాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ ఒక్క రోజు మాత్రమే వారు మహిళలని గౌరవిస్తారు. మహిళలు, వాళ్ళ విలువ ఏమిటో ఒక్కసారిగా గుర్తించే రోజుగా భావిస్తారు. వారిలో మహిళల పట్ల ఈ గౌరవం, ఈ భావం కేవలం 24 గంటలు మాత్రమే.. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే మహిళలని ట్రీట్ చేస్తారని.. సో ఈ రోజు హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అవ్వగా.. కొంతమంది అనసూయకి సపోర్ట్ గా మాట్లాడుతుంటే.. మరికొందరు.. అనసూయ ఎప్పుడు ఇంతే అని లైట్ తీసుకుంటున్నారు.
Anasuya wishes Happy Fools Day on Women's Day






































