ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Amazon Prime Video bags streaming rights of Acharya

అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ గా కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులని ముగించేసిన టీం.. ప్రస్తుతం నడుస్తున్న రిలీజ్ డేట్స్ క్లాష్ తో ఏప్రిల్ 29 న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అవడం రిలీజ్ డేట్ ఇవ్వడం చేసారు. ఏప్రిల్ 1 నుండి ఆచార్య ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో మొదలు పెట్టాలని ఆచార్య టీం ఆలోచనగా తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు కి జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడిగా గ్లామర్ హీరోయిన్ పూజ హెగ్డే కనిపించనున్నారు.

అయితే ఆచార్య పై ఉన్న క్రేజ్ తో ఈ సినిమా శాటిలైట్ హక్కులని జెమిని ఛానల్ క్రేజీ డీల్ తో కి దక్కించుకోగా.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఆచార్య సినిమా థియేటర్స్ లో విడుదలైన 50 రోజులకి గాను అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది అని సమాచారం. ఆమేరకు మేకర్స్ తో ఒప్పందాలు పూర్తయినట్లుగా టాక్. 

Amazon Prime Video acquires OTT rights of Acharya

Amazon Prime Video bags streaming rights of Acharya
megastar chiru
koratalla
ram charan
amazon prime video
acharya
acharya ott rights