Advertisement

కన్ ఫర్మ్ : భీమ్లా భీభత్సం ఫిబ్రవరి 25 నుంచే.!

Tue 15th Feb 2022 09:41 PM
pawan kalyan,rana,bheemla nayak movie,pawan kalyan bheemla nayak on 25th feb,sagar k chandra,trivikram  కన్ ఫర్మ్ :   భీమ్లా భీభత్సం ఫిబ్రవరి 25 నుంచే.!
Bheemla Nayak On 25th Feb కన్ ఫర్మ్ : భీమ్లా భీభత్సం ఫిబ్రవరి 25 నుంచే.!
Advertisement

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి అనుకోని ట్విస్ట్. పవర్ స్టార్ ఫాన్స్ కి అమేజింగ్ గిఫ్ట్. భీమ్లా నాయక్ రిలీజ్ ఫిబ్రవరి 25 నే అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది. టోటల్ సోషల్ మీడియా ఈ అప్ డేట్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిర్మాత నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు భీమ్లా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేస్తూ 09 :30 pm కి ఇలా ట్వీట్స్ వేసారో లేదో లా లా భీమ్లా అంటూ పండగ చేసేసుకుంటున్నారు పవన్ ఫాన్స్.

నిజానికీ రోజు శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు 25 న రావడం పక్కా అని ప్రకటించడం, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని మూవీ కూడా అదే రోజున వస్తున్నాం అని ఎనౌన్స్ చేయడంతో భీమ్లా రాక ఏప్రిల్ 1 నే అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వచ్చిందీ ఆటంబాంబ్ లాంటి న్యూస్. ఓ వైపు స్టార్ హీరో అజిత్ వలిమై చిత్రం తమిళంతో పాటు హిందీలోనూ ఫిబ్రవరి 24 న వస్తున్నప్పటికీ, మరోవైపు అలియాభట్ గంగూభాయ్ కూడా పాన్ ఇండియా ఫిలింగా ఫిబ్రవరి 25 నే రానున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ బరిలో పవన్ పవర్ చూపిస్తామంటూ భీమ్లా టీమ్ ధైర్యంగా రంగంలోకి దూకడం విశేషమే. నార్త్ లోను, ఓవర్సీస్ లోను ఆ రెండు చిత్రాల ఎఫెక్టునీ, ఆంధ్రాలో టికెట్ రేట్స్ అండ్ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ హర్డిల్స్ నీ తట్టుకుని మరీ తన సత్తా చూపించాల్సిన తరుణం ఇది పవన్ కి. 

మరి వెండి తెరపై తనని చూడాలని తహతహలాడి పోతున్న పవన్ ఫాన్స్ ఇప్పుడెలాంటి ఓపెనింగ్సుని ఇస్తారో, సరైన స్టార్ సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తోన్న ఆడియన్స్ ఇప్పుడిక ఏ రేంజ్ లో రెస్పాండ్ అవుతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 17 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. కలెక్షన్లలో కొత్త రికార్డు ఆవిష్కృతమైపోతుంది. 

ఇంతకీ ఈ భీమ్లా రాకతో ఇప్పుడు తప్పుకునేది వరుణ్ తేజ్ ఒక్కడేనా.. శర్వా కూడానా అనేది రేపు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అభిమాన జనాల్లో భీమ్లా జాతర మొదలైపోయినట్టే...!!

Bheemla Nayak On 25th Feb :

Pawan Kalyan Bheemla Nayak On 25th Feb 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement