అఖండ ప్రభంజనం ఇకపై హాట్ స్టార్ లో.!

బాలకృష్ణ - బోయపాటి కాబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కి హ్యాట్రిక్ హిట్ కొట్టిన అఖండ మూవీ.. డిసెంబర్ 2 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అఖండనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ నట విశ్వరూపం, థమన్ మ్యూజిక్ అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలవడంతో.. అఖండ మూవీ ఫాన్స్ కి మాత్రమే కాదు.. మాస్ ప్రేక్షకులందరికీ బాగా ఎక్కేసింది. బాలయ్య అఘోర గెటప్, థమన్ మ్యూజిక్ అఖండ ని అందనంత ఎత్తులో నిలబెట్టింది. ఈ మూవీ విడుదలైన 50 రోజులకి ఆర్టీసీ క్రాస్ రాడ్స్ లోని ఓ థియేటర్స్ లో అఖండ 50 రోజుల వేడుకని మూవీ టీం ఘనంగా నిర్వహించింది. 

ఈమధ్య కాలంలో 50 రోజుల వేడుకని 100 థియేటర్స్ లో జరుపుకున్న ఏకైన సినిమా అఖండ నే కనిపించింది. ఓ పక్క కరోనా, మరోపక్క ఏపీ లో టికెట్ రేట్స్ ఇష్యు టైం లో అఖండ భారీ విజయాన్ని నిర్మాతలకి అందించింది.

ఇప్పటివరకు థియేటర్స్ లో మోత మోగించిన అఖండ ఇప్పుడు మీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి నేరుగా ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరకి వచ్చేసింది. జనవరి 21 సాయంత్రం 6 గంటల నుండి డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో ప్రసారం అవుతుంది. అఖండ మూవీ డిజిటల్ రైట్స్ ని భారీ డీల్ ద్వారా డిస్ని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అలాగే స్టార్ మా అఖండ శాటిలైట్ హక్కులని దక్కించుకుంది. 

మరి థియేటర్స్ దుమ్ము దులిపిన అఖండ ఇకపై మీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మీ కోసం.. ఎంజాయ్..!

All set for Balakrishna Akhanda OTT streaming

All set for Akhanda OTT streaming
akhanda
balakrishna
boyapati
thaman music
pragya jaiswal
akhanda movie
disney plus hot star