ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు రష్మిక పేరు మార్మోగిపోతోంది. ఛలో, గీత గోవిందం మూవీస్ తో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక.. చాలా తొందరగానే స్టార్ హీరోల ఛాన్స్ లు పట్టేసింది. మహేష్ తర్వాత అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ చేసేసింది. ఇక బాలీవుడ్ లో అయితే చెప్పక్కర్లేదు. అక్కడ యంగ్ హీరోల సినిమాతో పాప బాగా బిజీ. జిమ్ వీడియోస్ తో అదరగొట్టే రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ చూసిన కొంతమంది నెటిజెన్స్ రష్మిక పై నెగటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ అమ్మాయిని హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారురా బాబు, అసలు ఈ ఫేస్ హీరోయిన్ ఎలా అయ్యింది.. ఇలా చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చినా రష్మిక వాళ్ళకి స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది.
నెటిజెన్స్ ఏదో అన్నారు అని ఫీలవ్వకుండా.. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలతో ఫాన్స్ కి ముందుకు వచ్చేస్తుంది. డైరీ రాసే అలవాటున్న రష్మిక.. ఆ డైరీ ముచ్చట్లు కూడా ఫాన్స్ తో పంచుకుంటుంది. ఇక లేటెస్ట్ ఫోజులు ట్రై చేస్తున్న అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక న్యూ పిక్స్ పోస్ట్ చేస్తుంది. రష్మిక పోస్ట్ చేసిన నిమిషాల్లోనే ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఫైర్ ఎమోజిస్ పెట్టి రష్మిక తన స్మూత్ అండ్ కూల్ లుక్ ని షేర్ చేసింది. బ్యాగ్ రౌండ్ నుండి.. రష్మిక మీద ఫైర్ అంటే అగ్ని కలర్ తో గోల్డ్ గా మెరిసిపోతుంది. మరి మీరు రష్మిక కొత్త ఫోజ్ ని ఓ లుక్కెయ్యండి.