Advertisement

సంక్రాంతి సినిమాలపై ఏపీ ప్రభుత్వం మరో బాంబ్

Wed 05th Jan 2022 02:06 PM
ap,ap government,night curfew small movies,pongal movies,sankranthi movies  సంక్రాంతి సినిమాలపై ఏపీ ప్రభుత్వం మరో బాంబ్
Night Curfew In AP Will Affect Small Movies సంక్రాంతి సినిమాలపై ఏపీ ప్రభుత్వం మరో బాంబ్
Advertisement

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చిన్న చూపు చూస్తుంది. పేదవాడికి ఆనందాన్ని పంచుతున్నామంటూ టికెట్ రేట్స్ తగ్గించేసి.. పెద్ద సినిమా నిర్మాతలపై పిడుగు వేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీ ని ఇబ్బంది పెడుతూ థియేటర్స్ పై దాడులు చేయించడంతో చాలా థియేటర్స్ మూతబడ్డాయి. సినీ ప్రముఖులు కూడా ఏం చేయలేకపోతున్నారు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వాన్ని ట్వీట్స్ తో చీల్చి చెండాడుతున్నాడు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ని టాగ్ చేస్తూ వర్మ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలపై బాంబ్ పేల్చేందుకు సిద్ధంగా ఉంది అంటున్నారు.

బిగ్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవడంతో.. ఈ సంక్రాంతికి చిన్న సినిమాల జాతర మొదలయ్యింది. హడావిడిగా ప్రమోషన్స్ మొదలు పెట్టి ఏదో కిందా మీద పడుతున్నాయి. మరి సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంటే ఏపీ ప్రభుత్వం ఎందుకూరుకుంటుంది.. అందుకే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించినట్టుగా ఈ నెల 10 నుండి ఏపీలో కూడా నైట్ కర్ఫ్యూస్ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది అని, ఒకవేళ నైట్ కర్ఫ్యూ పెడితే.. మూలిగే నక్కమీద తాటి  టెంక పడినట్లుగా చిన్న సినిమాలకు దెబ్బపడినట్లే. నైట్ షోస్ రద్దయితే.. కలెక్షన్స్ లో కోత ఏర్పడి నిర్మాతలకి నష్టాలూ రావడం ఖాయం. 

Night Curfew In AP Will Affect Small Movies:

Night curfew one hurdle for movies

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement