అమితాబ్ పారితోషికం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Fri 31st Dec 2021 01:21 PM
prabhas,project k,nag ashwin,amitabh bachchan,huge remuneration,project k update,deepika apdukone  అమితాబ్ పారితోషికం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Amitabh Bachchan huge remuneration for Project K అమితాబ్ పారితోషికం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Advertisement
Ads by CJ

భారత దేశం గర్వించ దగ్గ నటుల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ ఈమధ్య తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. చిరంజీవి సినిమా సైరా లోమెగాస్టార్ గురువుగా పాత్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్నా ప్రాజెక్ట్ కే లో కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా.. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్. ప్రాజెక్ట్ కే లో అమితాబ్ ఒక ముఖ్యమయిన రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి మేకర్స్ అమితాబ్ కి ఇస్తున్న పారితోషికం ఎంతో తెలుసా? 

రోజుకి 50  లక్షలు. అవునండి అక్షరాలా 50 లక్షలు. అమితాబ్ వర్క్ ఒక నెల రోజుల పాటు ఉంటుందిట. అంటే ఆయనకీ ఆ నెల రోజులకి పదిహేను కోట్లు ఇస్తున్నారు అన్నమాట. నిర్మాత అశ్వనీదత్ కదా. భారీ నిర్మాత అనే పేరు కూడా వుంది, అందుకే భారీ గా సినిమా తీస్తున్నారు. పాన్ వరల్డ్ అంటే మరి ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా. బడ్జెట్ షాకింగ్ అయితే ఏ బావుంటుంది.. ఇప్పుడు నటుల పారితోషకాలు అంతే షాక్ ఇస్తున్నాయి.. అది పాన్ వరల్డ్ రేంజ్ అంతే. ఇక ప్రాజెక్ట్ కే రెగ్యులర్ షూట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

Amitabh Bachchan huge remuneration for Project K:

Prabhas Project K Update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ