జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు వెండి తెర మీద జోష్ మీదుంది.. జబర్దస్త్ యాంకర్ గా స్టేజ్ పై కామెడీ కన్నా అనసూయ అందాలే హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. గ్లామర్ గా ఎలాంటి అడ్డు అదుపులేని స్కిన్ షో తో అనసూయ అదరగొట్టేస్తుంది. ఈమధ్యనే అనసూయ దాక్షాయణిగా పుష్ప సినిమాలో నటించింది. రంగస్థలంలో రంగమ్మత్త అంత పేరు రాకపోయినా.. అనసూయ నేషనల్ వైడ్ గా దాక్షాయణిగా పుష్ప సినిమాతో పరిచయం అయ్యింది. ఇక రీసెంట్ గా పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ లో తళుక్కున మెరిసిన అనసూయ భరద్వాజ్.. కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరమైంది.
కారణం అనసూయ ఫాదర్ క్యాన్సర్ తో ఈ మధ్యనే చనిపోవడంతో.. అనసూయ అటు జబర్దస్త్ కి ఇటు సోషల్ మీడియాకి కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ నిన్న బుధవారం అనసూయ నటిస్తున్న మలయాళ మూవీ ఫస్ట్ లుక్ ని పోస్ట్ చేసిన అనసూయ ఈ రోజు గురువారం జబర్దస్ ఫోటో షూట్ పోస్ట్ చేస్తుంది అనుకుంటే.. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిక్ తో పాటుగా Black and white 🖤🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది. పట్టు చీరలో మెడ లో నెక్ లెస్ తో అనసూయ బ్లాక్ అండ్ వైట్ లోనూ మెరిసిపోతుంది. అనసూయ అలా ఆ పిక్ ని పోస్ట్ చేసిందో లేదో.. ఇలా ఆమె అభిమానులు అనసూయ సో బ్యూటిఫుల్, అనసూయ నీ అందం కేక, అనసూయ సారీ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




                     
                      
                      
                     
                    
 ఆర్ ఆర్ ఆర్ పోస్టుపోన్ కానుందా?

 Loading..