Advertisementt

అభిమానమే హద్దుగా రాధే శ్యామ్ ప్రమోషన్స్

Wed 29th Dec 2021 11:18 AM
radhe shyam,prabhas,uv creations,prabhas radhe shyam,radhe shyam musical tour,vizag  అభిమానమే హద్దుగా రాధే శ్యామ్ ప్రమోషన్స్
Radhe Shyam Musical Tour starting from Vizag అభిమానమే హద్దుగా రాధే శ్యామ్ ప్రమోషన్స్
Advertisement
Ads by CJ

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

తాజాగా రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్ వైజాగ్ నుంచి మొదలైంది. దీనికోసం చుట్టూ పోస్టర్స్ తో ఉన్న ఒక వాహనాన్ని సిద్ధం చేశారు. ఇది కూడా అభిమానులతో లాంచ్ చేయించారు. సినిమాకు సంబంధించిన ప్రతి మేజర్ విషయాన్ని అభిమానులతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రభాస్ అండ్ టీం.

జనవరి 7 నుంచి ప్రభాస్ ప్రమోషన్స్ లో భాగం కానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. దీనికోసం నేషనల్ మీడియాతో కూడా ప్రభాస్ మాట్లాడనున్నారు. భారీ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు రాధే శ్యామ్ టీం. దీనికి హీరో ప్రభాస్ కూడా తన 100% ఎఫర్ట్ పెడుతున్నారు. చిత్ర యూనిట్ కూడా ఇప్పటి నుంచి మీడియాకు ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.

రాధాకృష్ణ కుమార్ ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మొదటి లవ్ స్టోరీ ఇది. ప్రభాస్, పూజా హెగ్డే ఇందులో జంటగా నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Radhe Shyam Musical Tour starting from Vizag:

Radhe Shyam To Begin Promotions In Full Swing

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ