Advertisementt

ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ ఈవెంట్: గెస్ట్ లు వారే

Wed 22nd Dec 2021 07:05 PM
chiranjeevi,balakrishna,rrr movie,rrr pre-release,tollywood,rajamouli,jr ntr,ram charan  ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ ఈవెంట్: గెస్ట్ లు వారే
Chiranjeevi, Balakrishna for RRR pre-release in Tollywood ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ ఈవెంట్: గెస్ట్ లు వారే
Advertisement
Ads by CJ

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాని ఎంత కష్టపడి తీశారో కానీ.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి మాత్రం చాలా కష్టపడుతున్నారు. తన హీరోలని వెంటేసుకుని రాజమౌళి.. ఐదు భాషల్లోనూ ప్రమోషన్స్ హీట్ తో ప్రేక్షకులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ అంటే తెలియని వాళ్ళకి కూడా ప్రమోషన్స్ తో వాళ్ళ మైండ్ లోకి ఎక్కించేస్తున్నారు. బాలీవుడ్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ చేసిన హడావిడికి బాలీవుడ్ హీరోలే తెల్లబోయారు. ఆ రేంజ్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ ని రాజమౌళి ప్లాన్ చేసి హిందీ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచేశారు. ఇక బెంగుళూర్, చెన్నై అంటూ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్రెస్ మీట్స్ పెట్టిన రాజమౌళి.. టాలీవుడ్ లో అదిరిపోయే ఈవెంట్ ప్లాన్ చేసారు.

ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ ఈవెంట్ లో ఆర్.ఆర్.ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటుగా ఇద్దరు స్పెషల్ గెస్ట్ లు రాబోతున్నారు. వారెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య. బాలకృష్ణ - చిరంజీవి ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ లుగా రాబోతున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ అంటే రొటీన్.. కానీ బాలయ్య, ఎన్టీఆర్ కలిసి స్టేజ్ పై ఉంటే.. నందమూరి ఫాన్స్ కి పండగే. బాలకృష్ణ తారక్ కలిసి ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో చూస్తే ఫాన్స్ ఆగుతారా.. అందుకే రాజమౌళి ఇలాంటి స్కెచ్ వేశారు. మరి మెగాస్టార్ - బాలయ్య ఒకే స్టేజ్ పై ఉన్నా ఆ క్రేజే వేరప్పా...

Chiranjeevi, Balakrishna for RRR pre-release in Tollywood:

RRR pre-release in Tollywood

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ