Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> RRR Mumbai Pre Release Event Highlights

ఆర్.ఆర్.ఆర్ ముంబై ఈవెంట్ హైలైట్స్

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కి రెడీ అవుతుంది. గత నెల రోజులుగా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల మైండ్ ని సెట్ చేస్తున్నారు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ తోనే పాన్ ఇండియా మొత్తం ఆర్.ఆర్.ఆర్ గురించి మట్లాడుకునేలా చేసారు. ఆయా భాషల్లో పెట్టిన ప్రెస్ మీట్స్ తో ఆ అంచనాలు మరింతగా పెంచేశారు. అయితే అవన్నీ ఒక ఎత్తు.. ముంబై లో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా జరిగిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఎత్తు అన్నట్టుగా కనిపించింది. అక్కడ ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లైవ్ ఇవ్వలేదు కానీ.. అక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఆర్.ఆర్.ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అలియా భట్, శ్రియ శరన్, అజయ్ దేవగన్ లు పాల్గొన్న ఈ ఈవెంట్ గా స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ .. ఆ ఈవెంట్ కి ఇచ్చిన స్పెషల్ ఎంట్రీ అదిరిపోయింది. జిలుగుల వెలుగు కాంతిలో క్రేన్‌తో మార్చిన స్పెష‌ల్ వాహ‌నంలో పై నుంచి కింద‌కు దిగి సల్మాన్ ఖాన్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆర్.ఆర్.ఆర్ స్టేజ్ పై సల్మాన్ ఖాన్ ఆర్.ఆర్.ఆర్ యూనిట్ ని రాజమౌళిని తెగ పొగిడేసాడు. ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ ఎంతగానో ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పిన సల్మాన్ ఖాన్ రామ్ చ‌ర‌ణ్‌లా హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌ను తాను చూడ‌లేద‌ని అన్నారు. 

అయితే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ గురించి ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంద‌ని చెప్పి సల్మాన్ ఖాన్ షాకిచ్చాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన నాలుగు నెలల వరకు మ‌రో సినిమా రిలీజ్ కాకుండా ఉంటే సూపర్ గా ఉంటుంది.. అంటూ సల్మాన్ ఖాన్ చెప్పడం చూస్తే బాలీవుడ్ లోను ఆర్.ఆర్.ఆర్ ఎంత క్యూరియాసిటీ, ఎంతగా అంచనాలున్నాయి.. అర్ధమవుతుంది ఈ ఒక్క ఈవెంట్ తోనే..

RRR Mumbai Pre Release Event Special

RRR Mumbai Pre Release Event Highlights
salman khan
rrr mumbai roar
ntr
ram charan
rajamouli
alia bhatt
ajay devgn
vijayendra prasad
bajrangi bhaijaan