Advertisementt

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ లు మాములుగా లేరుగా

Sun 19th Dec 2021 02:21 PM
bigg boss telugu 5,bigg boss telugu,grand finale chief guest updates,rashmika,sukuamr,pushpa team,ranbir kapoor,rajamouli,sai pallavi,kriti shetty,nani,jagapathi babu  బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ లు మాములుగా లేరుగా
Bigg Boss 5: Grand FInale Guest Revealed బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ లు మాములుగా లేరుగా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది.. మరికొద్ది గంటల్లో ఈరోజు ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో తేలిపోతుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో.. గత నాలుగు సీజన్స్ కి బుల్లితెర ప్రేక్షకులు చూసారు. మెగాస్టార్ చిరు గత రెండు సీజన్స్ లోను బిగ్ బాస్ విన్నర్స్ కి ట్రోపి అందచెయ్యడమే కాదు.. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది కంటెస్టెంట్స్ కి తమ సినిమాల్లో ఆఫర్స్ కూడా ఇస్తున్నారు చిరు. మరి ఈ ఏడాది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైకి రాబోయే గెస్ట్ లపై రకరకాల ఊహాగానాలు నడిచినా.. ఫైనల్ గెస్ట్ లు ఎవరో అనేది.. స్టార్ మా ఒక్క ప్రమో తోనే రివీల్ చేసేసింది.

మరి బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై నాగార్జున తో పాటుగా ఎవరెవరు సందడి చెయ్యబోతున్నారంటే.. ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి వచ్చేసారు. ఆయన కొన్ని నెలల పాటు ఫ్యామిలీని మిస్ అయిన మీరు అనగానే, మేము ఆర్.ఆర్.ఆర్ ని మిస్ అయ్యాం సర్ అన్నాడు సన్నీ.. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యిపోయిందిగా అంటూ రాజమౌళి టాప్ 5 మెంబెర్స్ ని ఆటపట్టించాడు. మరి ఇంకా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి స్పెషల్ గెస్ట్ గా సర్ ప్రైజింగ్ గెస్ట్ లుగా అలియా భట్, రణబీర్ కపూర్ రావడమే కాదు.. అలియా భట్ దబిడి దిబిడే అంటూ చెప్పిన డైలాగ్ ప్రోమోలో హైలెట్ అయ్యింది.

ఇక వీరితో పాటుగా పుష్ప టీంలో దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక, దేవిశ్రీ వచ్చారు. రష్మిక ఎప్పటిలాగే సామి సామి సాంగ్ కి డాన్స్ వేసి సర్ ప్రైజ్ చేసింది. ఇక మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ టీం నాని, సాయి పల్లవి, కృతి శెట్టి లు.. బిగ్ బాస్ స్టేజ్ పై, హౌస్ లోకి వెళ్లి చేసిన హడావిడి ప్రోమోకే హైలెట్ అనేలా ఉంది.. అంతేకాకుండా ఓల్డ్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ స్టేజ్ పై నాటు నాటు సాంగ్ పాడి సందడి చేసాడు. మరి బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటివరకు చప్పగా ఉన్నా.. గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై గ్రాండ్ గా వచ్చిన గెస్ట్ లతో.. ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.

Bigg Boss 5: Grand FInale Guest Revealed:

Bigg Boss Telugu 5 Grand Finale Chief Guest updates

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ