Advertisementt

బిగ్ బాస్ 5: సిరి - షణ్ముఖ్ ఓవరేక్షన్

Sat 18th Dec 2021 10:52 AM
bigg boss,bigg boss telugu 5,siri,shanmukh,srirama chandra,manas,sunny,bigg boss telugu 5 grand finals  బిగ్ బాస్ 5: సిరి - షణ్ముఖ్ ఓవరేక్షన్
Bigg Boss 5: Siri - Shanmukh Overaction బిగ్ బాస్ 5: సిరి - షణ్ముఖ్ ఓవరేక్షన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేపు ఆదివారం సాయంత్రం జరగబోతుంది. కేవలం ఒక్క రోజు మాత్రమే హౌస్ మేట్స్ ని బుల్లితెర ప్రేక్షకులు చూడొచ్చు. అయితే గత రాత్రి అంటే శుక్రవారం రాత్రి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఐదుగురు ఇంటి సభ్యులని గార్డెన్ ఏరియా కి పిలిచి ఎవరు ఈ ఇంటి నుండి బయటికి వెళ్లాలని అనుకుంటున్నారనగానే మానస్ అండ్ సన్నీ లు షణ్ముఖ్ పేరు చెప్పగా.. షణ్ముఖ్ సన్నీ పేరు, శ్రీరామ్ సిరి పేరు, సిరి మాత్రం మానస్ పేరు చెప్పింది. దానితో షణ్ముఖ్ మీరు ఇంటి నుండి వెళ్ళడానికి ఇద్దరి సభ్యులు ఏకాభిప్రాయంతో చెప్పారు.. అయినా సిరి మీరు ఇంటి నుండి వెళుతున్నారు అనగానే షణ్ముఖ్ మాడిపోయింది.. సిరి కూడా నేను వెళ్ళను అంటూ కాస్త రచ్చ చేసింది.. ఇక బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అవడంతో సిరి షణ్ముఖ్ ని వదల్లేక ఐ మిస్ యు అంటూ హగ్ చేసుకుని తెగ ఏడ్చేసింది. షణ్ముఖ్ కూడా సిరి కి ముద్దు పెట్టేసి పెద్ద సీన్ చేసేసారు.

సన్నీ నువ్వెక్కడికి వెళ్లవు వచ్చేస్తావ్ అన్నా సిరి ఏడుస్తూ సన్నీ మనసులో ఏం పెట్టుకోకు సారి అంటూ.. షణ్ముఖ్ ని బాగా చూసుకోండి అని చెబుతూ వెళ్ళింది. సిరి వెళ్ళగానే అదే గేట్స్ దగ్గర షణ్ముఖ్ కూర్చుని ఏడుస్తుంటే మానస్ ఓదార్చాడు. ఈలోపు సిరిని బిగ్ బాస్ కళ్ళకి గంతలు కట్టి కన్ఫెషన్ రూమ్ కి తీసుకొచ్చి సిరి మీరు వెళ్లడం లేదు అనగానే బిగ్ బాస్ త్వరగా పంపెయ్యండి షన్ను ఉండలేడు.. నేను వెళ్ళాలి అంటూ నానా హంగామా అతి చేసింది. మీరు మిగ్ బాస్ ఇంటిలోపలికి వెళ్లే టైం చెబుతాం అప్పుడు వెళ్ళండి అన్నా.. సిరి ఏడుస్తూ షణ్ముఖ్ ఉండలేడు.. పాపం షణ్ముఖ్ అంటూ చాలా ఓవరేక్షన్ చేసింది. ఇక బిగ్ బాస్ వెళ్ళమనగానే సిరి పరిగెత్తుకుంటూ షన్ను అంటూ వచ్చి హగ్గులు, ముద్దులు అబ్బో చూడడానికే చిరాకు పెట్టించేలా షణ్ముఖ్, సిరిలు గత రాత్రి ఎపిసోడ్ లో ఓవరేక్షన్ చెయ్యగా.. బుల్లితెర ప్రేక్షకులు సీజన్ చివరిలో మాకు ఈ ఖర్మేమిటి బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

Bigg Boss 5: Siri - Shanmukh Overaction:

Bigg Boss Telugu 5: Yesterday Episode Highlights

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ