Advertisementt

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఏం చేస్తున్నాడంటే..

Tue 14th Dec 2021 03:39 PM
hero abhijeet,bigg boss season 4 winner,abhijeet in vacation in vacation,abhijeet  బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఏం చేస్తున్నాడంటే..
Bigg Boss Season 4 Winner Abhijeet Vacation mod బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఏం చేస్తున్నాడంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 లో కూలెస్ట్ పర్సన్ గా అందరి మదిలను దోచేసిన.. అభిజీత్.. ఆ సీజన్ 4 కి టైటిల్ విన్నర్ అవుతాడనుకోలేదు.. ఫైనల్ లో సోహెల్, అఖిల్ సార్థక్ లు అభిజీత్ కి గట్టిగా పోటీ ఇచ్చారు. తనకి చెయ్యి నొప్పి ప్రాబ్లెమ్ వలన టాస్క్ ల పరంగా వీక్ గా ఉన్న అభిజిత్ విన్నర్ అంటే చాలామంది ఒప్పుకోలేదు.. కానీ హీరోగా అభిజిత్ కి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన అతను విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా బయటికి వచ్చిన అభిజిత్.. హీరోగా రీ లాంచ్ అవుతున్నాడని, నాలుగైదు సినిమాతో అభిజిత్ బిజీ కాబోతున్నాడని, అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున అభిజీత్ తో నాలుగు ప్రాజెక్ట్ సైన్ చేయించారని అబ్బో చాలానే ప్రచారం జరిగింది. మరోపక్క బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్, సోహెల్ లు హీరోలుగా సినిమాలు మొదలు పెట్టేసారు. అఖిల్ అయితే బుల్లితెర మీద షోస్ లో యాంకర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

మరి విన్నర్ అభిజిత్ సినిమాలు చెయ్యడం అటుంచి.. చేతికి గాయం పెద్దది కాగా.. ఆపరేషన్ చేయించుకుని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నాడు. కథలు వింటున్నాడన్న అభిజిత్.. ఎప్పుడెప్పుడు కొత్త సినిమా మొదలు పెడతాడా అని ఆయన ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అభిజిత్ ప్రస్తుతం వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్నాళ్ళు రెస్ట్ లో ఉన్న అభిజిత్.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి వెకేషన్స్ అంటూ రకరకాల ప్రదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 20 న విన్నర్ గా హౌస్ నుండి బయటకి వచ్చిన అభిజీత్.. సీజన్ 5 ముగియబోతున్నా.. కెరీర్ లో ముందుకు వెళ్లకుండా ఎక్కడ వున్నవాడు అక్కడే ఉన్నాడు.. మరి రేపు ఆదివారం గ్రాండ్ ఫినాలేలో ఎవరు విన్నర్ అయినా.. వాళ్ళ కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది అనుకుంటే పొరబాటే.

Bigg Boss Season 4 Winner Abhijeet Vacation mod:

Hero Abhijeet In vacation

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ