Advertisement

ఎఫ్ 3 నుండి విక్ట‌రి వెంకటేష్ బ‌ర్త్‌డే గ్లింప్స్

Mon 13th Dec 2021 03:15 PM
victory venkatesh,venkatesh birthday,glimpse from f3,f3 movie,anil ravipudi  ఎఫ్ 3 నుండి విక్ట‌రి వెంకటేష్ బ‌ర్త్‌డే  గ్లింప్స్
Venkatesh Birthday Glimpse From F3 Out ఎఫ్ 3 నుండి విక్ట‌రి వెంకటేష్ బ‌ర్త్‌డే గ్లింప్స్
Advertisement

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఈ సారి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. ఇపప్టికే F3 నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా వెంకటేష్ బర్త్ డే సందర్బంగా ఎఫ్ 3 నుంచి వెంక‌టేష్ స్పెష‌ల్ పోస్ట‌ర్ తో పాటు బ‌ర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ  గ్లింప్స్‌లో చార్మినార్ వాతావరణంలో నవాబులా డబ్బుని చేతిలో పట్టుకుని ఊపుతూ హాయిగా కనిపించారు. వెంకటేష్ తన మ్యానరిజంతో అదరగొట్టేశారు.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్  చిత్రానికి సీక్వెల్ అవ్వడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.  

హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను  రెడీ చేశారు. 

Venkatesh Birthday Glimpse From F3 Out:

Victory Venkatesh Birthday Glimpse From F3 Out

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement