Advertisement

అవసరమైతే నైట్ కర్ఫ్యూలు

Sat 11th Dec 2021 08:54 PM
corona virus,omicron variant,indian government,india,covid 19,night curfew  అవసరమైతే నైట్ కర్ఫ్యూలు
Night curfew if necessary: Central Government అవసరమైతే నైట్ కర్ఫ్యూలు
Advertisement

మళ్ళీ దేశంలో కేసులు పెరగడంతో.. అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ప్రస్తుతం అయితే దేశంలో కరోనా అదుపులో ఉన్నప్పటికీ ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం చాలా ఫాస్ట్ గా విస్తరించడం, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు గత రెండు వారాలుగా పెరుగుతుండంతో.. కేంద్రం అప్రమత్తమయ్యింది. కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ కేసులు లెక్కకు మించి నమోదు కావడంతో కేంద్రం ఆయా రాష్ట్రాలను  అప్రమత్తం చేసింది. దానితో కోవిడ్ విస్తరిస్తున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు సహా మరిన్ని ఆంక్షలు విధించే విషయమై దృష్టి సారించాలని ఆయా రాష్ట్రాలని కేంద్రం ఆదేశించింది .

10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటూ  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. వివాహాది శుభకార్యాలకు, అంతిక్రియలకి, పండుగలలో లెక్కలు మించి జన సమూహం ఉండకుండా చూడాలని కేంద్ర సూచనలు చేసింది. దానితో మరోసారి నైట్ కర్ఫ్యూలు తప్పేలా కనిపించడం లేదు.

Night curfew if necessary: Central Government:

Corona Omicron Variant update 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement