Advertisementt

బిగ్ బాస్ 5: కంటెస్టెంట్స్ ముసుగు తీసిన ఆడియన్స్

Fri 10th Dec 2021 07:49 PM
bigg boss 5,bigg boss telugu,audience letters,housemates,sriram,siri,shanmukh,kajal,manas,sunny  బిగ్ బాస్ 5: కంటెస్టెంట్స్ ముసుగు తీసిన ఆడియన్స్
Bigg Boss 5: Audience letters to Housemates బిగ్ బాస్ 5: కంటెస్టెంట్స్ ముసుగు తీసిన ఆడియన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లాస్ట్ వీక్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ వీక్ మొత్తం సరదాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు చేసిన కంటెస్టెంట్స్ లోనూ మధ్య మధ్యన గొడవలు జరిగాయి. అందులో శ్రీరామ్ కి కాజల్ కి గొడవ జరిగింది. మధ్యలో షణ్ముఖ్ - సన్నీ కాస్త గొడవ పడినా సన్నీ కూల్ అయ్యాడు. ఇక సిరి - షణ్ముఖ్ లు ఎప్పుడూ చేసే రచ్చే చేసారు. అయితే రెండు రోజులుగా ఇమిటేషన్ టాస్క్ అంటూ సన్నీ బాలయ్య గా, మానస్ పవన్ లాగా, కాజల్ శ్రీదేవిలా, షణ్ముఖ్ సూర్యలా, సిరి జెనీలియాలా, శ్రీరామ్ చిరులా వేషాలు కట్టి డాన్స్ చేసి ఫన్ చేసారు. ఇక షణ్ముఖ్ మాత్రం సిరి ఎవరితో అన్నా క్లోజ్ గా ఉంటే తెగ ఫీలైపోతున్నాడు. బిగ్ బాస్ అదే ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సూర్య గా పోలీస్ వేషం వేసిన షణ్ముఖ్ ని కూల్ చెయ్యడానికి కాజల్, సిరిలని ఇంప్రెస్ చెయ్యమని సన్నీ చెప్పగా.. కాజల్ ఏం చేసినా షణ్ముఖ్ ఇంప్రెస్ అవ్వలేదు.. సిరి హగ్ ఇవ్వగానే.. అక్కడే ఉన్న కాజల్ ఐ పాయె అంటూ కామెడీ చేసింది.

ఇక ఈ వారం హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ప్రేక్షకులు రాసిన.. కామెంట్స్ ని బిగ్ బాస్ స్క్రీన్ మీద చూపించాడు. ఆ లెటర్స్ లో శ్రీరామ్ కి ఇప్పుడు మీరు షన్ను గ్రూపా? అని రాసారు.. దానికి అందరూ నవ్వేయ్యగా. షణ్ముఖ్ నాకో గ్రూప్ ఏడ్చిందా అన్నాడు. ఇక మానస్ కి ఆడియన్స్ దగ్గర మంచి మర్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ లా వాడుకుంటున్నాడా? అని రాసారు. తర్వాత మోజ్ రూమ్ లో అది మానస్ ప్రశ్న కాదు.. సన్నీ ప్రశ్న అని షన్ను అనగానే.. శ్రీరామ్ గట్టిగా నవ్వేసాడు. ఇక సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్ గా ఫీలవుతారు? అని షణ్ముఖ్ కి రాసారు. నేను ఎక్సపెక్ట్ చేశా ఈ ప్రశ్న అన్నాడు షణ్ముఖ్.

శ్రీరామ్ మోజ్ రూమ్ లో నిజంగానే సిరిని కంట్రోల్ చేస్తూంటావా అని అడిగాడు.. కాజల్ కి మీరు కేవలం ఆటలో ముందుకెళ్లడానికే ఇలా ఫ్రెండ్లి గా ఉంటున్నారా? అనగానే కాజల్ ఎమోషనల్ అయ్యింది. ఎగ్జాక్ట్ గా నేను కాజల్ ని అదే ప్రశ్న అడిగాను అన్నాడు శ్రీరామ్. అది అందరికి ఉన్న ప్రశ్నే అంది సిరి. ఇక సిరికి మీరు షన్ను కన్నా స్ట్రాంగ్.. కానీ మీరెందుకు మిమ్మల్ని కన్సిడర్ చేసుకోవడం లేదు? అని.. ఇక షణ్ముఖ్ కి మళ్ళీ మొదలయ్యింది. నువ్వు నాకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ కుల్లుకున్నాడు.. మొత్తానికి బిగ్ బాస్ ప్రేక్షకులు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ముసుగు తీసేసి వారి అసలు రంగులు బయటపెట్టారు.

Bigg Boss 5: Audience letters to Housemates:

Bigg Boss 5 Telugu: Today Promo viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ