Advertisement

బిగ్ బాస్ 5: సన్నీ ఫన్ - మానస్ సీరియస్

Tue 07th Dec 2021 07:48 PM
bigg boss 5,bigg boss telugu,sunny,manas,kajal,sunny vs manas  బిగ్ బాస్ 5: సన్నీ ఫన్ - మానస్ సీరియస్
Bigg Boss 5: Sunny Fun - Manas Serious బిగ్ బాస్ 5: సన్నీ ఫన్ - మానస్ సీరియస్
Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 చివరి రెండు వారాల్లో ఏం చూస్తారు, ఏం చూడబోతున్నారో అనే ఆసక్తి, టాప్ లో ఎవరుంటారు అనే ఆత్రుత ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులలో కనిపిస్తుంది. ఈ సీజన్ మరో పది రోజుల్లో ముగియబోతుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ తో డిసెంబర్ 19 న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం చేస్తుంది స్టార్ మా. టాప్ 5 లోకి అడుగుపెట్టిన శ్రీరామ్ చంద్ర తప్ప మిగతా ఐదుగురు ఈ వారం డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వెళ్లారు.. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే మిగతా ఐదుగురు గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారు. ఇక ఈ ఈరోజు ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని ఇమిటేట్ చెయ్యాల్సిన టాస్క్ లో పింకీ - మానస్ ప్రయాణం అనగానే.. సన్నీ ప్రియాంక గాను, కాజల్ మానస్ గాను గెటప్స్ చేంజ్ చేసారు. సన్నీ ప్రియాంక లా విగ్గు, లంగా వోణి వేసుకుని అమ్మాయిలా మారిపోయాడు. 

అయితే సన్నీ గెటప్ చూసి, అతని విగ్ చూసి షణ్ముఖ్ కామెడీ చేసాడు. బ్యూటిఫుల్ పింకీ ఐ లవ్ యు అని మానస్ వేషంలో ఉన్న కాజల్ చెబుతుంది సన్నీకి. మానస్ పదే పదే పింకీ ఐ లవ్ యు చెబుతాడని అంటుంది కాజల్.. మీరిద్దరూ గబ్బు చెయ్యకండి అని మానస్ కోపంగా అన్నాడు.. ఎలా అయితే అలా వస్తుంది.. నాకేంటి అన్నాడు సన్నీ. అరే ఎంటర్టైనింగ్ గా చెయ్యాలిరా అంది కాజల్. ఎంటర్టైనింగ్ గా చెయ్యండి.. నేను ఎప్పుడు చెప్పాను అన్నిసార్లు పింకీకి ఐ లవ్ యు అంటూ సీరియస్ అయ్యాడు. మానస్ వద్దురా సీరియస్ అవ్వకు.. మూడ్ ఖరాబ్ అవుతుంది అన్నాడు సన్నీ.. ఎట్లయితదిరా కామెడీ.. అందుకే ముందు బయటే చెప్పాను.. మళ్ళీ లోపలి వచ్చి మళ్ళీ ఏమిటి ఈసాగదీత అంటూ మానస్ కోపమయ్యాడు.. ఎన్నిసార్లు చెప్పినా మీ మజాక్ అనగానే కాజల్ నేను మానస్ చెయ్యడం లేదు అంటూ ఏడుస్తూ వెళ్లబోతుంటే.. ఏయ్ పిచ్చిదానివా అన్నాడు సన్నీ.. అరే ఏం మనిషివిరా నువ్వు కేరెక్టర్ రా అది అని సన్నీ మానస్ తో అన్నాడు.. వద్దు వదిలేసేయ్ అంది కాజల్.. ఇది ఈ రోజు ప్రోమో హైలైట్స్.

Bigg Boss 5: Sunny Fun - Manas Serious:

Bigg Boss 5: New Promo goes viral

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement