ఏపీ ప్రభుత్వం ఈ మధ్యన అసెంబ్లీలో ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అలాగే అధిక టికెట్ రేట్స్ ని కంట్రోల్ చెయ్యడం, రోజుకి కేవలం నాలుగు షోస్ విధానాన్ని అమలు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం థియేటర్స్ లో సినిమా టికెట్ల కొత్త రేట్లను నేడు ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. సవరించిన ధరల ప్రకారం... అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా పేర్కొన్నారు. అంతేకాదు, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని చెబుతున్నారు.
మరి ఏపీ ప్రభుత్వానికి ప్రతి పక్ష హోదాలో ఉన్న ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ రిలీజ్ ముందు రోజునే ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ రేట్స్ ని ప్రకటించడం చూసిన వారు టిడిపి ఎమ్యెల్యే బాలకృష్ణ పై ఏపీ ప్రభుత్వం... అఖండ సినిమా విషయంలో ఇలా రివెంజ్ తీర్చుకుంది అంటున్నారు. గతంలో అంటే ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం.. ఇలానే టికెట్ రేట్స్ కట్టడి చెయ్యడంతో.. అప్పట్లో పవన్ ఫాన్స్ ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కక్ష కట్టి సినిమా ఇండస్ట్రీపై పగ తీర్చుకోవడం అన్యాయమంటూ ఇప్పటికే మెగాస్టార్ స్పందించగా.. తాజాగా కే రాఘవేంద్ర రావు స్పందించారు.