హరిహర వీరమల్లు సౌండ్ లేదే..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో బిజిగా వున్నారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ షూటింగ్ కోసం పవన్ కష్టపడుతున్నారు. అది సరే పవన్ నెక్స్ట్ చిత్రం హరి హర వీరమల్లు రెస్యూమ్ షూట్ ఇంకా మొదలు పెట్టలేదు.. ఎందుకంటే అక్టోబర్ 8 వరకు దర్శకుడు క్రిష్ తన కొండ పొలం మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాడు. పవన్ భీమ్లా నాయక్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అందుకే రెస్యూమ్ షూట్ మొదలు కాలేదు అని అన్నారు. కానీ హరి హర వీరమల్లు సెకండ్ వేవ్ పోయి ఇన్ని నెలలలైనా మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళింది లేనిది మేకర్స్ అప్ డేట్ ఇవ్వలేదు.
కనీసం క్రిష్ బర్త్ డే రోజున అయినా హరి హర వీరమల్లు అప్ డేట్ వస్తుంది అనుకుంటే ఆయన షిరిడి వెళ్లారు. హరిహర వీరమల్లు మేకర్స్ తో కలిసి షిర్డీ వెళ్ళాడు క్రిష్. మరి హరి హర వీరమల్లు సంక్రాంతి రేస్ నుండి తప్పుకుని ఏప్రిల్ కి వెళ్ళిపోయింది.. సో కూల్ గా షూటింగ్ చేసినా సరిపోతుందిలే అని క్రిష్ అనుకుంటున్నారా.. లేదంటే పవన్ డేట్స్ ఇవ్వడం లేదా.. మరి ఇంతవరకు హరిహరవీరమల్లు సౌండ్స్ సోషల్ మీడియాలో వినిపించలేదు.. దివాళి తర్వాత రెస్యూమ్ షూట్ అన్నారు.. కానీ.. ఇప్పటికైనా మేకర్స్ హరిహర వీరమల్లు అప్డేట్ ఇస్తే పవన్ ఫాన్స్ కూల్ అవుతారు.. లేదంటే సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు.
Hari Hara Veera Mallu Movie No Updates
Hari Hara Veera Mallu Movie Update








































