బిగ్ బాస్ 5: షణ్ముఖ్ ని మోసం చేసిన సిరి

Bigg Boss 5: Shanmukh vs PriyankaBigg Boss 5: Shanmukh vs Priyanka

బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఫ్రెండ్స్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ - సిరుల స్నేహం అంతకు మించి అన్నట్టుగానే సాగింది. కాకపోతే గత వారం కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముఖ్ కెప్టెన్ గా సిరిని కంట్రోల్ చెయ్యాలని చూస్తే సిరి రెచ్చిపోయి నీది ఫేక్ ఫ్రెండ్ షిప్ అంటూ నానా యాగీ చేసింది. అయితే నాగార్జున ఎపిసోడ్ కి వచ్చేసరికి షణ్ముఖ్ హీరో అంటూ సిరి షన్ను ని హీరోని చేసేసింది. వాళ్ళ గొడవ అంతా బిగ్ బాస్ కి కంటెంట్ ఇవ్వడానికే అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ వారం నామినేషన్స్ లో నలుగురిని ఆని మాస్టర్ జైల్లో పెట్టగా.. ఓ కీ చేతికి దొరికితే వారు జైల్లో ఉన్నవాళ్ళని సేవ్ చెయ్యొచ్చు. అలా ముందుగా కీ బజార్ మోగగానే ప్రియాంకకి కీ దొరికింది.

దానితో ప్రియాంక మానస్ ని జైలు నుండి విడిపించింది. ఆ తర్వాత సిరికి కీ దొరికింది. అందరూ షన్ను ని జైలు నుండి విడిపిస్తుంది అనుకుంటే. సారి షన్ను.. నీ గేమ్ మీద నీ కెపాసిటీపై నమ్మకం ఉంది. సో నేను జెస్సిని విడిపిస్తాను అంటూ షణ్ముఖ్ ని మోసం చేసి జెస్సిని విడిపించింది. ఆ తర్వాత జెస్సి షణ్ముఖ్ ని విడిపించాడు. ఇక షణ్ముఖ్ ఎవరో ఒకరిని జైలుకి పంపాలి అన్నప్పుడు ప్రియాంక ని పంపడానికి రెడీ అయ్యి నా కెప్టెన్సీలో ప్రియాంక వలన ఇబ్బంది పడ్డాను అనగానే ప్రియాంక సిల్లీ రీజన్ చెప్పకు అంది.. ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్‌ లేదని షన్ను అనగానే.. . నా పాయింట్‌లో నువ్వు కరెక్ట్‌ కాదు. ఆపాశం లేదని నన్ను నామినేట్ చేస్తావా.. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్‌ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు అంటూ పింకీ జైలుకు వెళ్ళింది. 

Bigg Boss 5: Latest promo viral

bigg boss 5
bigg boss telugu
shanmukh
priyanka
siri
jessy