Advertisement

కత్రినాకి కాబోయే అత్తగారి సర్ ప్రైజ్

Sat 06th Nov 2021 07:43 PM
katrina kaif,vicky kaushal,katrina special gift,vicky kaushal mother,diwali gift,sarees,sweets  కత్రినాకి కాబోయే అత్తగారి సర్ ప్రైజ్
Did Katrina Kaif Get Diwali Shagun From Vicky Kaushal mother కత్రినాకి కాబోయే అత్తగారి సర్ ప్రైజ్
Advertisement

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారని.. త్వరలోనే ఎంగేజ్మెంట్ అంటూ ప్రచారం జరుగుతుంది. మొన్నీమధ్యనే ఈ ప్రచారానికి ఊతమిస్తూ విక్కీ కౌశల్ కత్రినాతో త్వరలోనే ఎంగేజ్మెంట్ ఉండబోతుంది అంటూ చెప్పడంతో.. ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. విక్కీ కౌశల్ - కత్రినాలు పెళ్లి కి రెడీ అవుతున్నారని.. అయితే పెళ్లిని ఘనంగా కాకుండా సింపుల్ గా చేసుకోవాలని ఈ జంట అనుకుంటుందట. అందుకే ఎక్కడా హడావిడి అన్నది లేకుండా.. సింపుల్ గా వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది.

అయితే తాజాగా కత్రినా కైఫ్ కి విక్కీ కౌశల్ వాళ్ళ అమ్మ అంటే కత్రినాకి కాబోయే అత్తగారి దగ్గర నుండి చీరలు, నగలు వచ్చాయని.. పెళ్ళికి ముందు విక్కీ కౌశల్ వాళ్ళ ఫ్యామిలీ ఆచారం ప్రకారం.. ఈ చీర నగలు కత్రినాకి విక్కీ కౌశల్ తల్లి పంపినట్లుగా తెలుస్తుంది. కొంతమంది మాత్రం దివాళీ గిఫ్ట్ గా విక్కీ మదర్ సారీ, నగలు, స్వీట్స్ పంపారని అంటున్నారు. ప్రస్తుతం బి టౌన్ లో కత్రినా కైఫ్ కి అత్తగారు పంపిన గిఫ్ట్ విషయమే హైలెట్ అయ్యింది. ఇక డిసెంబర్ లోనే కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు పెళ్లి పీటలెక్కడం పక్కా అంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. 

Did Katrina Kaif Get Diwali Shagun From Vicky Kaushal mother:

Katrina Kaif, Vicky Kaushal wedding update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement