Advertisement

ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి పై దాడి..

Wed 03rd Nov 2021 11:04 PM
man attacks,actor vijay sethupathi,vijay sethupathi,bangalore airport  ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి పై దాడి..
Man kicks actor Vijay Sethupathi at Airport ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి పై దాడి..
Advertisement

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. హీరోగానూ, విలన్ గాను, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను అందరి మదిలో గుడి కట్టుకున్న హీరో. ఆయన వెండితెర మీదే కాదు.. రీసెంట్ గా బుల్లితెర మీద మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి తమిళ్ హోస్ట్ గాను దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ మూవీస్ తో బాగా బిజీగా వుండే విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి అనగానే ఆయన అభిమానులు ఒక్కసారిగా ఫీలైపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. విజయ్ సేతుపతి బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వస్తున్న సమయంలో విజయ్ సేతుపతి పై ఓ వ్యక్తి అనుకోకుండా దాడి చెయ్యడం కలకలం రేపింది.

ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వస్తున్న విజయ్ సేతుపతి పై ఓ వ్యక్తి వెనుకగా వచ్చి ఎగిరి తన్ని దాడి చెయ్యడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ వ్యక్తి విజయ్ సేతుపతిని పైకి ఎగిరి తన్నిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే సేతుపతి పై దాడి చేసిన వ్యక్తి ని అక్కడున్న వారంతా పట్టుకున్నారు. అయితే తనపై దాడి చేసిన ఆ వ్యక్తిని ఏం అనకుండా విజయ్ సేతుపతి అక్కడ నుండి కామ్ గా వెళ్లిపోవడం అందరిని ఆకర్షించింది. అసలా వ్యక్తి .. విజయ్ సేతుపతిపై ఎందుకు దాడి చేసాడు అనేది తెలియాల్సి ఉంది. 

Man kicks actor Vijay Sethupathi at Airport :

Man attacks actor Vijay Sethupathi at Bangalore Airport

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement