యంగ్ హీరో ఎట్టకేలకు కొట్టాడు హిట్

నాగ శౌర్య హీరోగా కెరీర్ స్టార్ట్ చేసాక ఓన్ బ్యానర్ లో ఛలో మూవీ తో అదిరిపోయే హిట్ కొట్టాడు. తర్వాత నాగ శౌర్య నటించిన సినిమాలేవీ.. సక్సెస్ అవ్వలేదు. అశ్వద్ధామ సినిమా హిట్ అని శౌర్య అంటాడు కానీ.. ఆ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. ఇక తాజాగా లక్ష్మి సౌజన్య అనే మహిళా దర్శకురాలి తో సితార ఎంటర్టైన్మెంట్ లాంటి బిగ్ బ్యానర్ తో కలిసి వరుడు కావలెను సినిమా చేసాడు. వరుడు కావలెను మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి ఆసక్తిని ప్రేక్షకుల్లో కలుగజేసింది. రీతూ వర్మ లుక్స్, కేరెక్టర్, ట్రైలర్, టీజర్, దిగు దిగు నాగ సాంగ్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ వరుడు కావలెను మూవీకి భారీ ప్రమోషన్స్ చేసారు. పూజ హెగ్డే, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ని వరుడు కావలెను ఈవెంట్స్ కి పిలిచి ప్రమోట్ చేయించడం సినిమాపై హైప్ పెరిగేలా చేసింది.

ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుడు కావలెను మూవీ ఫ్యామిలీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. ఆకాష్ గా నాగ శౌర్య లుక్స్, స్టయిల్, పెరఫార్మెన్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. రీతూ వర్మ నాగ శౌర్య రొమాంటిక్ సీన్స్, కాంబో సీన్స్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా నాగ శౌర్య స్టైలిష్ కి అందరూ పడిపోతున్నారు. సూపర్ స్టైలిష్ గా కొత్తగా నీట్ గా కనిపించాడని అంటున్నారు. ఇక సినిమాకి మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ప్లస్ అవడంతో వరుడు కావలెను హిట్ టాక్ తెచ్చేసుకుంది.. మరి మంచి కలెక్షన్స్ కూడా తీసుకువస్తే.. నాగ శౌర్య మరింత హ్యాపీ. ఏది ఏమైనా నాగ శౌర్య వరుడు కావలెను తో చాన్నాళ్ళకి హిట్ ట్రాక్ ఎక్కాడు. 

Naga Shaurya Happy with Varudu Kaavalenu hit

Young hero finally gets a hit
naga shaurya
varudu kaavalenu movie
varudu kaavalenu movie
young naga shaurya
varudu kaavalenu movie hit