ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Young Tiger NTR gets emotional at Puneeth Rajkumar condolence meet

స్నేహితుడిని అలా చూసి కన్నీరు పెట్టిన తారక్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ లు ఎంత మంచి ఫ్రెండ్స్ అందరికి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో పునీత్ తండ్రి రాజ్ కుమార్ లు కి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి.  తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఎన్టీఆర్ స్నేహితులయ్యారు. ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ తల్లిది మా రాష్ట్రమే అని పునీత్ చెప్పాడు. అలాగే ఎన్టీఆర్ తో ఏరి కోరి తన సినిమా కోసం పునీత్ పాట పాడించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన ప్లాప్ మూవీతో పునీత్ రాజ్ కుమార్ కన్నడ లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ - పునీత్ మంచి దోస్త్ లు. పునీత హార్ట్ ఎటాక్ తో మరణించాడని తెలియగానే.. ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ఆత్మీయుడిని కోల్పోయాను..పునీత్ మరణం తీరని లోటు అని, పునీత్ మరణ వార్త విని షాకయ్యను అని స్పందించాడు 

తాజాగా పునీత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ బెంగుళూరు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఎన్టీఆర్ స్నేహితుడు భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. పునీత్ అన్న శివ రాజ్ కుమార్ ని గట్టిగా కౌగిలించుకున్న ఎన్టీఆర్ స్నేహితుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించాడు. తన స్నేహహితుడిని, సోదరుణ్ణి కోల్పోయాను అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆయన పెద్ద కూతురు దృతి రాక ఆలస్యమవడంతో రేపటికి వాయిదా వేశారు. రేపు కంఠీరవ స్టూడియోలో తల్లితండ్రుల సమాధి వద్ద పునీత రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగబోతున్నట్టుగా కర్ణాటక సీఎం బొమ్మై ప్రకటించారు. 

Celebrities at Puneeth Rajkumar condolence meet

Young Tiger NTR gets emotional at Puneeth Rajkumar condolence meet
puneeth rajkumar
puneeth rajkumar condolence meet
jr ntr
tarak
puneeth rajkumar condolence meet
rana
balakrishna
Advertisement
Advertisement