Advertisement

F3 సెట్స్ లో సోనాల్ చౌహాన్

Thu 21st Oct 2021 06:34 PM
sonal chauhan,f3 sets,anil ravipudi,venkatesh,varun tej,tamannah,mehreen kaur,f3 movie  F3 సెట్స్ లో సోనాల్ చౌహాన్
Sonal Chauhan to heat up F3 F3 సెట్స్ లో సోనాల్ చౌహాన్
Advertisement

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో  ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా, మెహరీన్‌లు  హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను  ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌తో  దాదాపు ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.

Sonal Chauhan to heat up F3:

Sonal Chauhan at F3 sets

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement