Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు

Thu 21st Oct 2021 12:25 PM
bigg boss 5,bigg boss telugu,big boss,shanmukh,siri,jashwanth,jessie  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు
Bigg Boss 5: Shanmukh becomes heartbroken బిగ్ బాస్ 5: షణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో గత రాత్రి విజె సన్నీ కి ప్రియా కి మధ్యన కెప్టెన్సీ టాస్క్ లో బాగా గొడవైంది. కాజల్ - ప్రియా కూడా గొడవ పడ్డారు. ఇక సన్నీ - జెస్సిలు అరుచుకున్నారు. మధ్యలో సిరి మీద సన్నీ ఫైర్ అయ్యాడు. గత రాత్రి ఎపిసోడ్ అంతా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో రవి రెచ్చిపోయాడు. లోబోకి వెల్ కం చెబుతూ గంతులు వేశారు. తర్వాత జెస్సికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. దానికి సిరి హెల్ప్ తీసుకున్నాడు జెస్సి.. ఈ టాస్క్ లో జెస్సి గెలిచాడు. ప్రియా, షణ్ముఖ్, ప్రియంకాల దగ్గర జీరో ఎగ్స్ తో జెస్సి సీక్రెట్ టాస్క్ గెలిచాడు. బిగ్ బాస్ నాకూ సీక్రెట్ టాస్క్ ఇవ్వండి అని షణ్ముఖ్ అడిగితే రవి మధ్యలో అరే నువ్వు ముందు టాస్క్ బాగా ఆడు అనేసరికి షణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు.

ఈ టాస్క్ లో తనని ఉపయోగించుకుని జెస్సి, సిరి గేమ్ ఆడడం షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ వాళ్లందరేమో.. నువ్వు టాస్క్ సరిగా ఆడు అంటున్నారు.. ఈ వెధవ డైలాగ్స్ నేను వినాలి. పిచ్చ లైట్ తీసుకున్నారురా నన్ను అందరూ.. సిరి నువ్వు వాడికి హెల్ప్ చేసావ్.. నేను వెధవనయ్యాను.. అంటూ షణ్ముఖ్ కోపం గా వెళ్ళిపోయాడు. తన తప్పేం లేదు అని జెస్సి షణ్ముఖ్ కి చెబుతున్నాడు.. నేను హెల్ప్ అడిగితే సిరి చేసింది. నువ్వెవడివిరా చెప్పడానికి.. నా ఫీలింగ్ గురించి చెప్పాడని అంటూ షన్ను జెస్సి పై ఫైర్ అయ్యాడు. నువ్వు ఫ్రెండ్ అని ఫీలయ్యా కాబట్టే నీ దగ్గరకి వచ్చా అని సిరి అంటే.. నన్ను వెధవని చేసావ్.. నాకు గేమ్ ఆడడం కూడా రాదు అది నా దరిద్రం అంటూ షణ్ముఖ్ తెగ ఫీలవుతున్నాడు.. ఓదారుస్తున్న సిరి.. అరే నువ్వు వెళిపోరా ఇక్కణ్ణుంచి అంటూ చెప్పడంతో సిరి వెళ్ళిపోయింది. ఒంటరిగా షణ్ముఖ్ ఏడుపు స్టార్ట్ చేసాడు. సిరి, జెస్సి లు కూడా ఏడు మొదలు పెట్టారు.. ఇది ఈ రోజు ప్రోమో హైలైట్స్. 

Bigg Boss 5: Shanmukh becomes heartbroken:

Bigg Boss 5: latest promo highlights

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ