Advertisementt

పిక్ టాక్: షాకింగ్ లుక్ లో ప్రభాస్

Sun 17th Oct 2021 09:32 PM
prabhas,adipurush movie,om rauth,prabhas adipurush,shocking look of prabhas,prabhas new look,adipurush sets  పిక్ టాక్: షాకింగ్ లుక్ లో ప్రభాస్
Pic Talk: Prabhas Shocking Look From Adipurush Sets పిక్ టాక్: షాకింగ్ లుక్ లో ప్రభాస్
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ పరంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. బాహుబలి తో బాడీ పెంచిన ప్రభాస్ తర్వాత బరువు తగ్గడానికి చాలా వర్కౌట్స్ చేస్తున్నా పని జరగడం లేదు. సాహో లో కూడా ప్రభాస్ లుక్స్ వైజ్ గా కామెంట్స్ ఎదుర్కున్నాడు. ఇక రాధేశ్యామ్ లోను ప్రభాస్ లుక్స్ పై ఫాన్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి. ఆదిపురుష్ లో రాముడి పాత్ర కోసం ప్రభాస్ ఫిజిక్ పరంగా మేకోవర్ పరంగా కొత్తదనం చూపించడం కోసం డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ ని యూకే పంపబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ యుకె వెళ్ళాడో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆదిపురుష్ సెట్స్ నుండి ప్రభాస్ లుక్ ఒకటి బయటికి వచ్చింది.

ఆ పిక్ లో పెంచిన మీసకట్టుతో ప్రభాస్ కొత్తగా కనిపించాడు ఓకె.. కాకపోతే ఆ లుక్ లో ప్రభాస్ ని చూస్తుంటే భయం వేస్తుంది. అసలు బరువు తగ్గకుండా ప్రభాస్ బాహుబలి అప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు.. ఆ లుక్ లో ప్రభాస్ బరువు చూసిన ఫాన్స్ షాకవుతున్నారు. బుగ్గలు బాగా ఉబ్బి ఉన్నాయి. ఫేస్ చూస్తే చాలా ముదురుగా కనిపిస్తుంది.  సలార్ లో కాస్త రఫ్ గా కనిపిస్తున్న ప్రభాస్ లుక్ కి ఆ బరువు పెద్దగా హైలెట్ అవడం లేదు. కాని ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్ ఎప్పుడు కనిపించినా ఫాన్స్ షావుతున్నారు. మరి వరస పాన్ ఇండియా మూవీస్ సంతకాలు చేస్తున్న ప్రభాస్ ముందు సినిమాల లైనప్ కన్నా ఫిజిక్ మీద దృష్టి పెడితే బావుంటుంది అంటున్నారు.

Pic Talk: Prabhas Shocking Look From Adipurush Sets:

Shocking Look of Prabhas 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ