Advertisementt

బిగ్ బాస్ 5: రవి కుట్రకి బలైన శ్వేత

Sat 16th Oct 2021 12:15 PM
bigg boss 5,bigg boss 5 telugu,bigg boss,swetha,ravi,worst performer  బిగ్ బాస్ 5: రవి కుట్రకి బలైన శ్వేత
Bigg Boss 5: Yesterday Episode Highlights బిగ్ బాస్ 5: రవి కుట్రకి బలైన శ్వేత
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఆరోవారంలో వరెస్ట్ పెరఫార్మెర్ గా శ్వేత జైలు కి వెళ్ళింది. ఇంటి సభ్యులంతా రవి చెప్పిన చీటింగ్ కి శ్వేత ఓకె చెయ్యడం పట్ల ఆమెకి అందరూ వరెస్ట్ పెరఫార్మెర్ గా స్టాంప్ గుద్దడంతో శ్వేత జైలుకి వెళ్లాల్సి వచ్చింది. రవి ఇచ్చిన చెత్త ఐడియా వలన కెప్టెన్సీ టాస్క్ అర్హత కోల్పోవడమే కాదు.. ఆఖరికి రవి కుట్రకి శ్వేత బలయ్యింది. ఇక జైలు కి వెళుతూ శ్వేత ఎమోషనల్ అయ్యింది. శ్వేత జైల్లో ఉన్నంత సేపు నిద్ర పోవడం లేదంటూ యాని మాస్టర్ బెడ్ రూమ్ లో కాకుండా వేరే రూమ్ లో సోఫా లో పడుకుంటుంది. ఇక శ్వేత ని ఓదార్చడానికి సన్నీ, మానస్, షణ్ముఖ్ లు ట్రై చేస్తారు. అందరూ రవి  చేసిన తప్పుకు నువ్వు బలైపోయావని చెబుతారు.

ఇక హౌస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్యన పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఆ పోటీలో లగ్జరీ బడ్జెట్ కి సంబందించిన వస్తువులని గెలుచుకున్నారు. ఇక వరెస్ట్ పెరఫార్మెర్ విషయంలో సిరి, రవి, లోబో లకి కూడా ఎక్కువ స్టాంప్స్ పడ్డాయి. సంచాలక్ గా సిరి యాటిట్యూడ్ నచ్చలేదు అన్నారు. ఇక రవి బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించారని అన్నారు. అలాగే లోబో, శ్వేతలకు ఒకే రకమయిన కారణాలు చెప్పారు హౌస్ మేట్స్.. ఫైనల్ గా రవి చేసిన పనికి శ్వేత జైలుకి వెళ్లాల్సివచ్చింది. మరి ఈ వారం 10 మంది నామినేషన్స్ లో ఉండగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది. 

Bigg Boss 5: Yesterday Episode Highlights :

Bigg Boss 5 telugu update 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ