Advertisementt

నవంబర్ నుండి చిరు భోళా శంకర్

Fri 15th Oct 2021 09:39 AM
chiranjeevi,meher ramesh,bhola shankar movie,meher ramesh,bhola shankar movie update  నవంబర్ నుండి చిరు భోళా శంకర్
Chiru Bhola Shankar Movie update నవంబర్ నుండి చిరు భోళా శంకర్
Advertisement
Ads by CJ

చిరంజీవి ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసేసి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వరసగా రీమక్స్ చేసుకుంటూ పోతున్న చిరంజీవి.. మెహర్ రమేష్ తో తమిళ వేదాళం రీమేక్ చేస్తున్నారు. భోళా శంకర్ గా మెహర్ రమేష్ చిరు తో ఈ వేదాళం రీమేక్ చేపట్టారు. రక్షా బంధన్ స్పెషల్ గా చిరు చెల్లెలి గా కీర్తి సురేష్ నటించబోతున్నట్టుగా పోస్టర్స్ తో సహా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. చిరు - కీర్తి సురేష్ అన్న చెల్లెళ్ళ అనుబంధం ఆ పోస్టర్ లో తెలిసిపోయింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

తాజాగా దసరా స్పెషల్ గా భోళా శంకర్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహతి స్వర సాగర్‌ స్వరాలందిస్తున్న భోళా శంకర్ సినిమా నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు స్పష్టత ఇచ్చారు. మహతి సాగర్ బర్త్ డే స్పెషల్ గా గురువారమే ఈ అప్ డేట్ ఫాన్స్ కి అందించింది టీం. ఇక ఇందులో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముందని, పాటలు, నేపథ్య సంగీతం హై స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం తెలియజేసింది. అలాగే అన్న చెల్లెళ్ళ అనురాగం, ఎమోషన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటాయని వేదాళం చూసిన వారికి అర్ధమవుతుంది. మరి చిరు - కీర్తి సురేష్ ల అన్న చెల్లెళ్ళ అనుబంధం సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.  

Chiru Bhola Shankar Movie update:

Chiru - Meher Ramesh Bhola Shankar Movie update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ