Advertisement

మా ఎలక్షన్స్: అభిమానులపై లాఠీ ఛార్జ్

Sun 10th Oct 2021 01:51 PM
maa elections,police lathi-charge,fans,stars,celebrities  మా ఎలక్షన్స్: అభిమానులపై లాఠీ ఛార్జ్
MAA Elections: Police lathi-charge మా ఎలక్షన్స్: అభిమానులపై లాఠీ ఛార్జ్
Advertisement

హైదరాబాద్ లోని ఫిలిం నగర్ స్కూల్ లో జరుగుతున్న మా ఎలక్షన్స్ దగ్గర ఈ రోజు ఉదయం నుండే  పోటీ దారుల మధ్యన ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. మా ఎలక్షన్స్ లో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లు గత నెలరోజులుగా పోటీ పడడం ఒక ఎత్తైతే.. ఈ రోజు మా ఎన్నికల పోలింగ్ కేంద్ర వద్ద జరిగే పరిణామాలు ఒక ఎత్తు అనేలా ఉన్నాయి. మా ఎలక్షన్స్ జరిగే పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు ఉదయమే మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలకృష్ణ, నాగార్జున, నాని, అఖిల్, తరుణ్, హీరోయిన్స్ తో పాటుగా ముంబై నుండి ఫ్లైట్ లో వచ్చి జెనీలియా మా ఎన్నికల్లో ఓటు వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ ఫిలిం నగర్ లోని జూబ్లీ హిల్స్ స్కూల్ కి రావడంతో అక్కడుకి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం నుండి మా ఎన్నికలలో ఓట్ వెయ్యడానికి వచ్చే స్టార్స్ ఒక ఎత్తు, అభిమానులు ఒక ఎత్తు అనేలా అక్కడ పరిస్థితి మారిపోయింది. మా ఎన్నికల్లో ఓట్స్ వేసే స్టార్ ని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. అఖిల్ వచ్చే టైం లో అఖిల్ తో సెల్ఫీలు తీసుకోవడానికి ఫాన్స్ ఒక్కసారిగా ఎగబడడంతో పోలీస్ లు లాటి ఛార్జ్ కూడా చెయ్యాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

MAA Elections: Police lathi-charge:

Police lathi-charge at MAA Elections

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement