Advertisement

సస్పెన్స్ కి తెర దించేసి.. షాకిచ్చిన ప్రభాస్

Thu 07th Oct 2021 11:20 AM
prabhas,sandeep vanga,spirit movie,spirit pan indi film,spirit title,rpabhas spirit,prabhas and sandeep vanga spirit announced  సస్పెన్స్ కి తెర దించేసి.. షాకిచ్చిన ప్రభాస్
Prabhas 25 Movie Spirit Announced సస్పెన్స్ కి తెర దించేసి.. షాకిచ్చిన ప్రభాస్
Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసేసి.. సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ తో బిజీగా వున్నారు. బాహుబలి క్రేజ్ తో వరస పాన్ ఇండియా మూవీస్ తో దూసుకుపోతున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ తో కలిసి ప్రాజెక్ట్ కే అంటూ పాన్ వరల్డ్ మూవీ చెయ్యబోతున్నాడు. ఇక ఈ నాలుగు సినిమాలే భారీ బడ్జెట్ తో భారీ గా తెరకెక్కుతున్నాయి.. ఎప్పటికి పూర్తవుతాయో అనుకుంటే.. తాజాగా ప్రభాస్ తన Prabhas25 మూవీ అనౌన్సమెంట్ ఇవ్వబోతున్నట్టుగా గత నాలుగు రోజులో సోషల్ మీడియాలో అటెంక్షన్స్ క్రియేట్ చేసాడు. ప్రభాస్ ఫాన్స్ అయితే.. Prabhas25 ఎనౌన్సమెంట్ కోసం సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ట్రెండ్ చెయ్యడమే కాదు.. ఎప్పుడెప్పుడు ఎనౌన్సమెంట్ వస్తుందా.. ఎవరి డైరెక్షన్ లో మూవీ ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు.

మరి అందరి ఆత్రుతకి, అనుసమానాలకి, సస్పెన్స్ కి తెరదించుతూ ప్రభాస్ తన 25 వ ప్రోజెక్ట్ ని అనౌన్స్ చేసేసారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ ని 8 భాషల్లో భూషణ్ కూంర్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారంటూ అంటూ పాన్ ఇండియా ఫిల్మ్ ని ఎనౌన్స్ చేసారు. టి సీరియస్ తో కలిసి వంగా ఫిలిం కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ప్రభాస్ 25 ఫిలిం స్పిరిట్ ఉండబోతున్నట్లుగా అప్ డేట్ ఇచ్చారు. మరి రెండు రోజులుగా సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ మూవీ అంటున్నా.. మరికొంతమంది దర్శకులు లైన్ లో ఉండడంతో.. ఎక్కడో చిన్న అనుమానం. మరా అనుమానాన్ని పటాపంచలు చేస్తూ Prabhas25 ఫిలిం స్పిరిట్ అనౌన్సమెంట్ ఇచ్చేసారు. 

Prabhas 25 Movie Spirit Announced:

Prabhas and Sandeep Vanga Spirit announced

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement