ప్రభాస్ ప్రాజెక్ట్ కె పై అదిరే అప్ డేట్

Mon 20th Sep 2021 10:56 AM
prabhas,nag ashwin,nag ashwin - prabhas,project k update  ప్రభాస్ ప్రాజెక్ట్ కె పై అదిరే అప్ డేట్
Prabhas Project K Surprising update ప్రభాస్ ప్రాజెక్ట్ కె పై అదిరే అప్ డేట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సోలార్ మూవీ, ఓం రౌత్ తో ఆదిపురుష్ మూవీ షూటింగ్ ని పారలల్ చేస్తున్నాడు. ముంబై, హైదరాబాద్ అంటూ ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండడమే కాదు.. నాగ్ అశ్విన్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ కె కోసం కూడా రెడీ అవ్వబోతున్నాడనే న్యూస్ తో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ కోసం ప్రభాస్ మేకోవర్ అయ్యేందుకు యుకె వెళ్ళబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. తాజాగా టాలీవుడ్ లో జరిగిన ఈవెంట్ లో ప్రభాస్ ఓ చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ కోసం బయటికి వచ్చారు.. ప్రభాస్ ఆ లుక్ లో ఇంకాస్త బొద్దుగానే కనిపిస్తున్నారు.

అయితే ఇప్పడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చెయ్యబోయే ప్రాజెక్ట్ కె పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె ప్రభాస్ కి జోడిగా నటిస్తుంది. హైదరాబాద్ లో రీసెంట్ గా మొదలైన ప్రాజెక్ట్ కె సినిమా ట్రయిల్ షూట్ ని హైదరాబాద్ లోనే నిర్వహించిన నాగ ఆశ్విన్ ప్రభాస్ తో నవంబర్ నుండి అధికారికంగా అంటే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. ప్రాజెక్ట్ కె కి సంబందించిన 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. దాని కోసం మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారట. 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ ఈ మూవీని గ్రాండ్ గా పాన్ వరల్డ్ మూవీ గా నిర్మించబోతున్నారు. 

Prabhas Project K Surprising update:

Prabhas Project K update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ