డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నితిన్ మ్యాస్ట్రో స్ట్రీమింగ్

Thu 16th Sep 2021 11:22 PM
nithin,nithin maestro movie,disney plus hotstar,nabha natesh,tamannah  డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నితిన్ మ్యాస్ట్రో స్ట్రీమింగ్
Nithin Maestro streaming in Disney plus hotstar డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నితిన్ మ్యాస్ట్రో స్ట్రీమింగ్

నితిన్ - నాభ నటేష్ జంటగా.. తమన్నా భాటియా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్న మ్యాస్ట్రో మూవీ మరికాసేపట్లో బిగ్ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదున్ మూవీని తెలుగులో మేర్లపాక గాంధీ.. దర్శకత్వంలో నితిన్ రీమేక్ చేసారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ అదిరిపోయే రేంజ్ లో చేపట్టారు. ఇక కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అనే అనుమానంతోనే నితిన్ మ్యాస్ట్రో ని ఓటిటి కి అమ్మేసారు.

డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు మ్యాస్ట్రో డిజిటల్ హక్కులని దక్కించుకుంది. సెప్టెంబర్ 17 న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంది టీం. మ్యాస్ట్రో ప్రోమోస్, మ్యాస్ట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్, నితిన్, నభ నటేష్ ఇంటర్వూస్ అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు. మ్యాస్ట్రో ఓటిటి నుండి రిలీజ్ కాబట్టి.. ఈ రోజు రాత్రి 12 గంటలకు అంటే మరికాసేపట్లోనే మ్యాస్ట్రో మూవీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది.  గెట్ రెడీ ఆడియన్స్.. నితిన్ మ్యాస్ట్రో  ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో వీక్షించేసి బాగా ఎంజాయ్ చెయ్యండి. 

Nithin Maestro streaming in Disney plus hotstar:

Nithin Maestro streaming alert