కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష, అనుష్క శెట్టి, సమంత ఇలా ఆ తరం హీరోయిన్స్ అంతా సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పూజ హెగ్డే, రష్మిక, తాజాగా కృతి శెట్టి హవా మొదలైంది. అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత లు ఎక్కడా తగ్గడం లేదు. గ్లామర్, చేతిలో సినిమాలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అందమైన గ్లామర్ పిక్స్ తో ఎప్పుడూ యూత్ ని ఫిదా చేస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2, మజిలీ, ఓ బేబీ, జాను లాంటి ప్రత్యేకమైన సినిమాలతో సమంత ఇప్పుడు టాప్ 1 లోనే ఉంటుంది. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది ఎస్ నెలకు టాప్ 10 హీరోస్, టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ రివీల్ చేసింది.
అందులో.. పెళ్లి చేసుకున్నాక కెరీర్ లో దూసుకుపోతున్న గ్లామర్ హీరోయిన్ సమంత నెంబర్ 1 గా నిలవగా.. పెళ్లి చేసుకున్నాక కూడా వరస సినిమాలతో అదరగొట్టేస్తున్న కాజల్ అగర్వాల్ నెంబర్ 2 స్తానాన్ని కైవసం చేసుకుంది. అసలు ఫామ్ లో లేని అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక ఇప్పుడిప్పుడే టాప్ చైర్ కి దగ్గరవుతున్న రష్మిక 4 వ స్థానంలో, 5 వ స్థానాల్లో సీటిమార్ తో హిట్ కొట్టిన తమన్నా, 6 వ స్థానంలో సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్, 7 వ స్థానంలో ప్రస్తుతం నెంబర్ వన్ చైర్ కి సమీపంలో ఉన్న పూజ హెగ్డే, నెంబర్ 8 లో రకుల్ ప్రీత్, 9 వ స్థానంలో రాశి ఖన్నా, 10 వ స్థానంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఉన్నారు.