మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. సెకండ్ వేవ్ తర్వాత సర్కారు వారి పాట షూటింగ్ హైదరాబాద్ లో మొదలవడం, తదుపరి షెడ్యూల్ కి గోవాకి వెళ్లడం తెలిసిందే. గోవా షెడ్యూల్ ని పూర్తి చేసి హైదరాబాద్ చేరుకున్న సర్కారు వారు పాట ఇక్కడే ఓ సెట్ లో తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టింది. ఇంతవరకు సర్కారు వారి పాట విలన్ పై అందరిలో ఆశక్తి ఉంది. మొన్నటి వరకు హీరో అర్జున్ విలన్ అన్నప్పటికీ.. తర్వాత కోలీవుడ్ నటుడు సముద్రఖని సర్కారు వారి పాట విలన్ అన్నారు.
మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు కానీ..సముద్ర ఖని నే సర్కారు వారి పాట విలన్ అని, తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ లో సముద్ర ఖని పాల్గొంటున్నారని, మహేష్ - సముద్రఖని కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ షూటింగు మరికొన్ని రోజుల పాటు సాగనుంది. నిన్నటి నుంచే ఈ సినిమా షూటింగులో సముద్రఖని పాల్గొంటున్నారు. ఇక ఇప్పటికే సముద్రఖని డిఫ్రెంట్ విలన్ కేరెక్టర్స్ లో అదరగొట్టేస్తుంటే.. ఇప్పుడు మహేష్ ఫాన్స్ సర్కారు వారి పాటలో మహేష్ తో సముద్రఖని ఎలాంటి లుక్ తో ఢీ కొడతాడా అనే క్యూరియాసిటీతో ఉన్నారు.