విశాల్‌ సామాన్యుడు

హీరో విశాల్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు తు.పా శరవణన్ తో జతకట్టారు. విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ  సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విశాల్ 31వ చిత్రం టైటిల్ సామాన్యుడు. ఇది నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. ఈ సంద‌ర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్ లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్ తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. ఈ మరియు పోస్టర్  అతను నాట్ ఏ కామన్ మ్యాన్ అని ట్యాగ్‌లైన్‌ను సమర్థిస్తుంది.

విశాల్ సరసన డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో  యోగి బాబు- బాబురాజ్ జాకబ్- పిఎ తులసి-రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సామాన్యుడు త్వరలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

Vishal, Thu Pa Saravanan, VFF Saamanyudu First Look Out

Vishal Saamanyudu First Look Out
vishal
thu pa saravanan
vff
saamanyudu first look
saamanyudu movie