ప్రభాస్ ఫాన్స్ లో ఆందోళన

అదేమిటి ప్రభాస్ వరసబెట్టి పాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్ ని ఫుల్ జోష్ లో చేస్తుంటే ప్రభాస్ ఫాన్స్ వర్రీ అవడం ఎందుకు అనుకుంటున్నారా? ప్రభాస్ నిజంగానే పాన్ ఇండియా మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ చేసేసాడు. అయితే ప్రభాస్ సలార్ సెకండ్ షడ్యూల్ పూర్తి చేసి ముంబై వెళ్లి అక్కడ ఆదిపురుష్ సెట్ లో వాలిపోయాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సెట్స్ లో హడావిడి చేస్తున్నాడు. 65 రోజుల ఆదిపురుష్ షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. 

అయితే ఓం రౌత్ ఈ 65 రోజుల షూట్ లో రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రధారి కృతి సనన్ పాత్రలపై చాలా సన్నివేశాలు పూర్తి చేసారు. అసలు ఈ 65 రోజుల షూట్ లో ప్రభాస్ పాల్గొన్న రోజులు చాలా తక్కువ. అంటే సినిమా సగం పార్ట్ పూర్తికాగా.. అందులో ప్రభాస్ చాలా తక్కువ రోజుల షూట్ లో పాల్గొనడంతో.. ప్రభాస్ అసలు ఆదిపురుష్ లో ఎంత సేపు కనిపిస్తాడని అనే దాని మీద ప్రభాస్ ఫాన్స్ లో ఆందోళన మొదలైంది. రాముడిగా ఆదిపురుష్ లో ప్రభాస్ ప్రతి సీన్ లో కనబడాలని ప్రభాస్ ఫాన్స్ అనుకుంటుంటే.. ఇప్పుడు ఈ న్యూస్ తో ప్రభాస్ ఫాన్స్ లో అనుమానాలు మొదలైపోయాయి. 

Prabhas and Kriti Sanon begin shooting for Adipurush

Anxiety in Prabhas Fans
prabhas - adipurush
director om raut
prabhas adipurush pan india movie
bollywood star saif ali kha
prabhas pan india star
prabhas - kriti sanon
saif ali khan - prabhas
adipurush pan india film
prabhas
adipurush update
adipurush shooting