Advertisementt

ఎప్పుడో జరిగిన పార్టీ, ఇప్పుడు ఎందుకు..

Sat 28th Aug 2021 07:39 PM
chiranjeevi,megastar felicitates pv sindhu,pv sindhu,tokyo olympics  ఎప్పుడో జరిగిన పార్టీ, ఇప్పుడు ఎందుకు..
Megastar Chiranjeevi felicitates PV Sindhu ఎప్పుడో జరిగిన పార్టీ, ఇప్పుడు ఎందుకు..
Advertisement
Ads by CJ

చిరు ఇంట్లో టోక్యో ఒలింపిక్స్ లో పథకాన్ని సాధించిన పివి సింధు కి అతిధి సత్కారాలు జరిగాయి. ఆ పార్టీకి చిరు ఫ్రెండ్స్, చిరు ఫ్యామిలీ అంతా హాజరైంది. చిరు ఇంట్లోనే పివి సింధు కి చిరు పార్టీ ఇవ్వడం అనేది ఎప్పుడో జరిగిన మేటర్. అంటే పది రోజుల క్రితమే పివి సింధు ని చిరంజీవి ఘనంగా సత్కరించి పార్టీ ఇచ్చారనేది రాధికా శరత్ కుమార్ బయట పెట్టిన ఫోటో వలన లీక్ అయినా.. చిరు నుండి ఎలాంటి స్పందన రాలేదు. 

అయితే అప్పుడెప్పుడో జరిగిన పివి సింధు సత్కారంపై చిరంజీవి తాజాగా ప్రకటన చెయ్యడం కాస్త ఆశ్చర్యం కూడా అనిపించింది. అంటే తాజాగా చిరంజీవి ఒలింపిక్స్ లో పథకాన్ని సాధించిన పివి సింధు ని సత్కరించడం గర్వంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఒలింపిక్ విజేత సింధు కడుఆ చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటాను అంటూ స్పందించింది..  

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సామాజిక వేదిక ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన, సింధు తో చిరు దిగిన ఫొటోస్, రాధికా, సుహాసిని పివి సింధు తో చిరు దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు అంటే నాగార్జున, రానా, రాధికా, సుహాసిని లు సింధు ఫ్రేమ్ లో కనిపించడమే హాట్ టాపిక్ అయ్యింది. 

Megastar Chiranjeevi felicitates PV Sindhu:

Chiranjeevi felicitates PV Sindhu

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ