ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NTR, Ram Charan RRR release delayed again

ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ లో గందరగోళం

సెకండ్ వేవ్ తగ్గి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. సినెమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. కానీ భారీ బడ్జెట్ సినిమాలు.. ఇంకా షూటింగ్స్ బ్యాలెన్స్ ఉండడంతో.. అవన్నీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ కెజిఫ్ చాప్టర్ 2, పుష్ప, రాధేశ్యాం లాంటి మూవీస్ ఉండగా.. ముందుగా అక్టోబర్ రిలీజ్ అంటూ దసరాకి రిలీజ్ డేట్ వచ్చిన ఆర్.ఆర్.ఆర్ మేకర్స్.. సెకండ్ వేవ్ తగ్గినా.. షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నా.. తమ సినిమా అక్టోబర్ 13 నే అంటూ మళ్ళీ మళ్ళీ డేట్స్ ప్రకటిస్తున్నారు. 

ప్రమోషనల్ ఈవెంట్స్ లో పదే పదే అక్టోబర్ 13 నే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటున్నారు. కానీ రాజమౌళి మరోసారి ఆర్.ఆర్.ఆర్ ని పోస్ట్ పోన్ చేయబోతున్నాడని.. అక్టోబర్ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ అక్టోబర్ నుండి మారబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఏం మాట్లాడడం లేదు. సినిమాపై ఎలాంటి ప్రచారం జరిగినా.. ఖచ్చితంగా అక్టోబర్ లోనే సినిమా రిలీజ్ అని చెప్పకపోవడంతో ఎన్టీఆర్ -చరణ్ ఫాన్స్ లో గందరగోళం మొదలయ్యింది. 

RRR release date postponed again

NTR, Ram Charan RRR release delayed again
rrr pan india movie
ntr with ram charan
ram charan as alluri sita ramaraju
komaram bheem as ntr
rajamouli
jakkanna
ntr rrr movie
ram charan rrr movie
rajamouli rrr
d.v.v danayya
dvv entertainment
alia bhatt
ajay devagan