Advertisementt

గాయంతో ఎన్టీఆర్.. ఫాన్స్ లో ఆందోళన

Sun 08th Aug 2021 01:33 PM
rrr,ntr,rrr ntr,ram charan,ntr charan combo,rrr pan india movie  గాయంతో ఎన్టీఆర్.. ఫాన్స్ లో ఆందోళన
RRR shooting video viral గాయంతో ఎన్టీఆర్.. ఫాన్స్ లో ఆందోళన
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. అక్కడ రాజమౌళి, రామ్ చరణ్ లతో కలిసి షూటింగ్ స్పాట్ లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. అక్కడ ఉక్రెయిన్ కి వెళ్ళాక తాను ఐడి కార్డు వేసుకుని తీసుకున్న ఫోటో ని షేర్ చేసాడు. దానితో ఫాన్స్ హ్యాపీ ఫిల్ అయ్యారు. ఇక ఉక్రెయిన్ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుండి ఎన్టీఆర్ - రాజమౌళి, రామ్ చరణ్ లు సరదాగా ఉన్న ఫొటోస్ ని షేర్ చెయ్యగా.. చరణ్ అండ్ ఎన్టీఆర్ లు ఓ గోడ మీద కూర్చుని ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోస్ లో ఎన్టీఆర్ నుదుటి మీద చిన్న గాయమై.. అక్కడ ప్లాస్టర్ వేసి ఉండడంతో ఎన్టీఆర్ ఫాన్స్ లో అందోళన మొదలైంది.

అయితే ఎన్టీఆర్ కి దెబ్బ ఎలా తగిలింది అంటూ నిర్మాతలను సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ తగులుకున్నారు. దానితో ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు ఎన్టీఆర్ గాయం పై క్లారిటీ ఇచ్చారు. అది సినిమాలో భాగంగా ఎన్టీఆర్ నుదుటి మీద గాయం కనిపించాలని, కేవలం షూటింగ్ కోసం పెట్టిన గాయమే ని చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఊపిరి తీసుకుంటున్నారు. లేదంటే అభిమాన హీరోకి దెబ్బతగలడంపై ఫాన్స్ కంగారు పడిపోయి.. ఫీలైపోతున్నారు.

RRR shooting video viral:

RRR Movie update 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ