Advertisement

అంత లాభం వస్తుంటే.. ఎందుకొదిలేస్తారు

Fri 06th Aug 2021 09:38 PM
nani,nani tuck jagadish movie,tuck jagadish movie,nani tuck jagadish ott release,amazon prime videos,ott  అంత లాభం వస్తుంటే.. ఎందుకొదిలేస్తారు
Tuck Jagadish OTT release confirmed? అంత లాభం వస్తుంటే.. ఎందుకొదిలేస్తారు
Advertisement

నిన్నటివరకు మా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ హడావిడి చేసిన టక్ జగదీశ్ మేకర్స్.. ఇప్పుడు ఉన్నట్టుండి.. ఓటిటి కి అమ్మేశారనే న్యూస్ మొదలయ్యింది. నాని టక్ జగదీశ్ థియేట్రికల్ రిలీజ్ కాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రిలీజ్ చేస్తున్నారని భీబత్సమైన ప్రచారం జరుగుతున్నా మేకర్స్ మాత్రం కామ్ గా ఉన్నారు. అంటే టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ అని వారు చెప్పకనే చెబుతున్నారు. అయితే ఓటిటి నుండి టక్ జగదీశ్ కి వచ్చిన ఆఫర్.. ఇప్పడు ఈ టైం లో థియేటర్స్ లో రిలీజ్ చేసిన రాని లాభాలు ఓటిటి రిలీజ్ కి రావడంతోనే మేకర్స్ ఇలా అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్టుగా తెలుస్తుంది. 

టక్ జగదీశ్ ని ఓటిటికి అమ్మడం వలన నిర్మాతలకు ఏకంగా 20 కోట్లు లాభాలొచ్చాయట. మీడియం హీరో లలో ఫస్ట్ ప్లేస్, నిర్మాతలకు లాభాలు తెచ్చే హీరోగా పేరున్న నాని క్రేజ్.. ఇలా టక్ జగదీశ్ కి పని చేసింది అని, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేలా మూవీ ఉంది కాబట్టే అమెజాన్ ప్రైమ్ కూడా టక్ జగదీశ్ కి మంచి ఆఫర్ ఇచ్చింది అని, గతంలో నాని వి కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదలై అమెజాన్ ప్రైమ్ కి లాభాలు తేబట్టే ఈ సినిమానికి అమెజాన్ మంచి డీల్ ఇచ్చింది అని అంటున్నారు. ఆ లాభాలు చూసే మేకర్స్ నానిని ఒప్పించి టక్ జగదీశ్ ని డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. 

Tuck Jagadish OTT release confirmed?:

Nani Tuck Jagadish OTT release confirmed?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement