స్టార్ మా లో త్వరలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ పై బుల్లితెర ప్రేక్షకులు మంచి ఆసక్తితో ఉన్నారు. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ 5 ని వీక్షిద్దామా అని ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ 5 మొదలవుతుంది అనుకుంటే.. కమింగ్ సూన్ అంటూ లోగో ని రివీల్ చేసింది స్టార్ మా. అంటే ఈ నెలలోనే బిగ్ బాస్ 5 మొదలు కావొచ్చు అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 5 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
షణ్ముఖ్ జాస్వంత్, నవ్య స్వామి, సిరి ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు యాంకర్ వర్షిణి పేరు ఫిక్స్ అంటున్నారు. అంటే బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ క్వారంటైన్ మొదలైపోయింది. అందుకే వర్షిణి స్టార్ మా కామెడీ షో కి రాలేదంటున్నారు. స్టార్ మా లో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి యాంకర్ గా వస్తున్న వర్షిణి గత వారం రాలేదు. ఆమె ప్లేస్ లోకి శ్రీముఖి రావడంతో.. వర్షిణి బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉంది. అందుకే వర్షిణి ఈ షోకి రాలేదని చెప్పుకుంటున్నారు. ఇక వర్షినికి బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చింది అని, ఈసారి ఆమె అందాలే బిగ్ బాస్ 5 కి స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు.