Advertisement

అఖండ అఘోరపై మరింత హైప్ పెంచారు

బోయపాటి - బాలయ్య కాంబోలో హ్యట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ ఫైనల్ అండ్ క్లైమాక్స్ షెడ్యూల్ తమిళనాడులో జరుగుతుంది. బోయపాటి - బాలకృష్ణ కాంబో అంటే.. ఆ రేంజ్, ఆ క్రేజ్ ఏ లెవల్లో ఉంటుందో ఇప్పుడు అఖండ మూవీ పై అంతే ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర గా డిఫ్రెంట్ గా కనిపించబోతున్నారు. అఘోర పాత్రపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను ఈ సినిమాలో నటిస్తున్న జగపతి బాబు పాత్ర మరింతగా పెంచుతుంది. 

లెజెండ్ మూవీలో బాలకృష్ణ తో భారీ ఫైట్స్ చేసిన జగపతి బాబు అఖండ లో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారట. అయితే బాలకృష్ణ అఘోర పాత్ర ఇంటర్వెల్ కి ముందు ఎంటర్ అవుతుందని, అలాగే జగపతి బాబు పాత్ర కూడా ఇంటర్వెల్ కి ముందే రివీల్ అవుతుంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఎంతో హైలైట్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అలా దాన్ని డిజైన్ చేశాడట బోయపాటి శ్రీను. మరి అఘోర పాత్రకి జగపతి పాత్రకి ఎక్కడో లింకై వుంటుంది అని, అందుకే ఈ రెండు పాత్రలను బోయపాటి ఇంటర్వెల్ కి ముందు ఎంట్రీ ఇప్పిస్తున్నాడని అంటున్నారు. 

Jagapathi Babu plays an Aghori in Akhanda

Raised more hype on Akhanda Agora
jagapathi babu
balakrishna
akhanda movie
balayya akhanda movie
aghori in akhanda
boyapati - balayya combo