Advertisementt

ప్రముఖ నటి జయంతి మృతి

Mon 26th Jul 2021 09:59 AM
kannada senior actress,senior actress jayanthi,jayanthi passed away,telugu - tamil - kannada - hindi,jayanthi died  ప్రముఖ నటి జయంతి మృతి
Senior Actress Jayanthi Passed Away ప్రముఖ నటి జయంతి మృతి
Advertisement
Ads by CJ

సీనియర్ నటి జయంతి ఈ రోజు ఉదయం బెంగుళూరులోని తన ఇంట్లోనే కన్ను మూసారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయంతి ఈ రోజు అంటే సోమవారం ఉదయం మృతి చెందడం ఆమె అభిమానులని కలిచి వేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో 500 చిత్రాలకి పైగా నటించిన జయంతి వయసు 76 ఏళ్ళు. కన్నడ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయంతి తెలుగులో కొండవీటి సింహం, పెదరాయుడు, బొబ్బిలి యుద్ధం లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం జయంతి బెంగుళూరులో ఉంటున్నారు. అనారోగ్యంతో ఈ రోజు ఉదయమే ఆమె మృతి చెందినట్టుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జయంతి మరణంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా ఇండుస్త్రీలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Senior Actress Jayanthi Passed Away:

Kannada Senior Actress Jayanthi Passed Away

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ