Advertisement

ఆగష్టు 15 తర్వాతే బిగ్ బాస్

Sat 24th Jul 2021 07:13 PM
bigg boss 5,big boss telugu,sep 5th start,big boss season  ఆగష్టు 15 తర్వాతే బిగ్ బాస్
Bigg Boss season 5 update ఆగష్టు 15 తర్వాతే బిగ్ బాస్
Advertisement

సెప్టెంబర్ 5 న బిగ్ బాస్ సీజన్ 5 మొదలువుతుంది అని అంటున్నారు. ఆగష్టు లో లోగో లాంచ్, ప్రో షూట్ ఉండబోతుంది అని, సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటి షో మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని స్టార్ మా ఎంపిక చేసేసింది అని, ఓ 18 మందిని ఒకేసారి అంటే ఓపెనింగ్ డే రోజునే బిగ్ బాస్ కి పంపే ఏర్పాట్లలో ఉందట స్టార్ మా. అంటే వైల్డ్ కార్డు ఎంట్రీ మధ్యలో ఉన్నా.. ముందుగానే ఓ 18 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారట.

ఇప్పటికే ఎంపికైన లిస్ట్ ప్రకారం ఆ కంటెస్టెంట్స్ ని ఆగష్టు 15 తర్వాత క్వారంటైన్ కి పంపి.. సెప్టెంబర్ 5 న హౌస్ లోకి గ్రాండ్ గా పంపాలనే నిర్ణయంలో ఉన్నారట. బిగ్ బాస్ 5 గ్రౌండ్ వర్క్ ఫినిష అయ్యింది అని, ఓ 20 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాతే కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఎంట్రీ ఉంటుందట. కరోనా సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ కూడా మొదలవుతున్న తరుణంలో బిగ్ బాస్ రూల్స్ అన్ని మారిపోతున్నాయని అంటున్నారు. ఇక ఈసారి సీజన్ 5 కి నవ్య స్వామి, సిరి, షణ్ముఖ్ లాంటి ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ ఎంట్రీ ఇస్తున్నారనే టాక్ ఉంది. 

Bigg Boss season 5 update :

Bigg Boss 5 Telugu update 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement